India vs England 1st Test Match Day 1 highlights: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. భారత బౌలర్లు పేలవమైన ప్రదర్శనతో నిరశ పరచగా.. 100వ టెస్ట్ ఆడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన సెంచరీ (128*) సాధించి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఓ వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బర్న్స్(33) పరుగులకు పెవిలియన్ బాట పట్టినా.. మరో ఓపెనర్ సిబ్లి (87) తో కలిసి కెప్టెన్ జో రూట్ (128*) రెండు వందల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే చివరి ఓవర్ బుమ్రా బౌలింగ్‌లో సిబ్లి ఎల్బీడబ్యూ అయి సెంచరీని చేజార్చుకున్నాడు.
2021లో మూడు సెంచరీలు
ఈ ఏడాది ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఆడిన ప్రతీ టెస్ట్‌లో సెంచరీ చేయడం గమనార్హం. ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లోనూ రూట్ సెంచరీలు చేశారు. రెండు టెస్టుల్లో కూడా 228, 186 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇండియాలోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Also Read: