నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. 160 పరుగుల ఆధిక్యం.. అదరగొడుతున్న టీమిండియా బౌలర్లు..

|

Jan 18, 2021 | 7:03 AM

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట మొదలపెట్టిన ఆస్ట్రేలియా జట్టుకు..

నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. 160 పరుగుల ఆధిక్యం.. అదరగొడుతున్న టీమిండియా బౌలర్లు..
India Vs Australia 2020
Follow us on

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట మొదలపెట్టిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ ఆదిలోనే షాక్ ఇచ్చింది. నిలకడ ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(48), మార్కస్ హారిస్(38)లను వెంటవెంటనే ఔట్ చేసిన టీమిండియా బౌలర్లు.. కొద్దిసేపటికే ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మెన్ లబూషేన్‌(25), వేడ్(0)లను కూడా పెవిలియన్ బాట పట్టించారు. అటు ఆసీస్ 156 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్(9), గ్రీన్(1) ఉండగా.. 32 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు ఠాకూర్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, అంతకముందు 21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వార్నర్ బౌండరీలతో డీల్ చేయగా.. హారిస్ మంచి సహకారం అందించాడు. అయితే టీమిండియా వరుస ఇంటర్వెల్స్‌లో వికెట్లు పడగొట్టి ఆసీస్‌కు గట్టి షాక్ ఇచ్చింది.