
India Vs Australia 2020: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకరి తర్వాత ఒకరు ఆటగాళ్లందరూ గాయాల బారిన పడుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పితృత్వ సెలవులపై భారత్ వెళ్ళగా.. పేసర్ షమీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, హనుమ విహారిలు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు ఇదే కోవలో తాజాగా టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా పొత్తి కడుపులో నొప్పి కారణంగా నాలుగో టెస్టును వైదొలిగినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీనితో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.