India vs South Africa: తొలి టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

|

Jun 10, 2022 | 12:39 AM

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. సొంతగడ్డపై గురువారం రాత్రి ఊహించనిరీతిలో పరాజయం..

India vs South Africa: తొలి టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
Follow us on

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. సొంతగడ్డపై గురువారం రాత్రి ఊహించనిరీతిలో పరాజయం ఎదురైంది. దక్షిణాఫ్రికాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 211 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీమ్‌ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. డేవిడ్‌ మిల్లర్ (64; 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డస్సెన్ (75; 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు.

ముందుగా ఓపెనర్ ఇషాన్ కిషన్ (76: 48 బంతుల్లో 11×4, 3×6) మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో డేవిడ్ మిల్లర్ (64 నాటౌట్: 31 బంతుల్లో 4×4, 5×6), దుస్సేన్ (75 నాటౌట్: 46 బంతుల్లో 7×4, 5×6) అసాధారణరీతిలో ఆడి దక్షిణాఫ్రికా జట్టుని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 212/3తో గెలిపించారు. దాంతో.. ఐదు టీ20ల సిరీస్‌లో సఫారీలు 1-0తో ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో టీ20 మ్యాచ్ కటక్‌లో ఆదివారం రాత్రి జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి