
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సాగిన రెండో వన్డే మ్యాచ్‌కు వరణుడు అడ్డు తగలాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలి తీవ్ర ఒత్తిడిలో పడిన వేళ, అనూహ్యంగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆటను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా గర్నూర్ బ్రార్ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో నిప్పులు చెరుగుతూ ఏకంగా 4 కీలక వికెట్లు పడగొట్టి కివీస్ నడ్డివిరిచాడు. అతనికి తోడుగా నబీ, అన్షుల్ కాంబోజ్ చెరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బౌలర్ల సమష్టి దాడితో కివీస్ బ్యాటింగ్ లైనప్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి చివరకు 41 ఓవర్లలో కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. బ్రార్ తీసిన నాలుగు వికెట్లు మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాయి.
కేవలం 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఈజీగా టార్గెట్‌ను పూర్తి చేస్తుందని అంతా భావించారు. అయితే న్యూజిలాండ్ బౌలర్లు అనూహ్య రీతిలో చెలరేగడంతో పరిస్థితి తారుమారైంది. వరుస విరామాల్లో భారత టాప్, మిడిల్ ఆర్డర్ వికెట్లను పడగొట్టిన కివీస్ బౌలర్లు మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. కేవలం 26 ఓవర్లు ముగిసే సమయానికే భారత్ 113 పరుగుల వద్ద ఏకంగా 7 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే క్రీజులో కేఎల్ రాహుల్ ఉండడం వల్ల భారత్ గెలపు ఖాయమని అంతా అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వర్షం పడింది. దీంతో అంపైర్లు 4 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచినట్లు ప్రకటించారు.