ప్రాక్టీస్ చేస్తూనే ప్రాణాలు వదిలిన అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు

మంగళవారం (నవంబర్ 25) హర్యానాలోని రోహ్‌తక్‌లో ప్రాక్టీస్ సమయంలో స్తంభం పడి 16 ఏళ్ల అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ ఆటగాడు మరణించాడు. దీంతో హర్యానా క్రీడా మంత్రి గౌరవ్ గౌతమ్ చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన జిల్లా క్రీడా అధికారిని, మొత్తం నర్సరీని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రాక్టీస్ చేస్తూనే ప్రాణాలు వదిలిన అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు
Basketball Player Hitesh Rathi

Updated on: Nov 26, 2025 | 5:20 PM

మంగళవారం (నవంబర్ 25) హర్యానాలోని రోహ్‌తక్‌లో ప్రాక్టీస్ సమయంలో స్తంభం పడి 16 ఏళ్ల అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ ఆటగాడు మరణించాడు. దీంతో హర్యానా క్రీడా మంత్రి గౌరవ్ గౌతమ్ చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన జిల్లా క్రీడా అధికారిని, మొత్తం నర్సరీని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన మంత్రి, అథ్లెట్ మరణానికి కారణమైన ఏ అధికారిని అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషాద సమయంలో మొత్తం ప్రభుత్వం ఆ కుటుంబంతో అండగా నిలుస్తుందని క్రీడా మంత్రి పేర్కొన్నారు. ఇది చాలా విషాదకరమైన సంఘటన, వ్యక్తిగతంగా షాక్‌కు గురిచేసిందన్నారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్ నాయకుడు వినేష్ ఫోగట్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “హర్యానా పిల్లలు ఫీల్డ్‌లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం కాగితంపై,ప్రకటనలలో అభివృద్ధి కోసం చూస్తోందని మండిపడ్డారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదు, ఇది వ్యవస్థ హత్య, క్రీడాకరుల కలలు, వారి విశ్వాసం, వారి భవిష్యత్తు చంపేస్తున్నారని ఫోగట్ విరుచుకుపడ్డారు. ఇది సరియైన క్రీడా విధానం కాదు, ఇది ఆటగాళ్ల కలల బహిరంగ హత్య.” అని విమర్శించారు.

మరోవైపు, క్రీడా డైరెక్టర్ జనరల్ హర్యానాలోని అన్ని జిల్లా క్రీడా అధికారులకు ఒక లేఖ రాశారు. శిథిలావస్థలో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలను మరమ్మతు చేయాలని సూచించారు. లోపభూయిష్ట క్రీడా పరికరాల వాడకాన్ని నిరుత్సాహపరచాలని ఆదేశించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..