Sara Lee: క్రీడా ప్రపంచంలో విషాదం.. 30 ఏళ్లకే కన్ను మూసిన WWE మాజీ రెజ్లర్‌.. కారణమేంటో చెప్పని కుటుంబ సభ్యులు

|

Oct 08, 2022 | 6:45 AM

లీ మరణ వార్తను ఆమె తల్లి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సారా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయిందని.. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశారు.

Sara Lee: క్రీడా ప్రపంచంలో విషాదం.. 30 ఏళ్లకే కన్ను మూసిన WWE మాజీ రెజ్లర్‌.. కారణమేంటో చెప్పని కుటుంబ సభ్యులు
Sara Lee
Follow us on

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం చెందింది. ఆమె వయస్సు కేవలం 30 ఏళ్లు మాత్రమే. . కాగా లీ మరణ వార్తను ఆమె తల్లి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సారా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయిందని.. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి కొంచెం ప్రైవసీ ఇవ్వాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇది విన్న ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. అయితే సారా మరణానికి గల కారణాలను వెల్లడించేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఇష్టపడడంలేదని తెలుస్తోంది. అయితే సారా లీ మృతికి సైనస్ ప్రధాన కారణమని తెలుస్తోంది. గత కొద్దికాలంగా ఆమె ఈ సమస్యతో బాధపడుతున్నారని కోలుకోలేకనే తుదిశ్వాస విడిచిందని సమాచారం.

ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా..

కాగా సారా లీ 2015 సంవత్సరంలో డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్‌ని పొందింది. అదే ఏడాది డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్‌ ‘టఫ్‌ ఎనఫ్‌’ సిరీస్‌ విజేతగా నిలిచింది. 2 016లో జరిగిన లైవ్ ఈవెంట్ లో ఆమె హీల్స్ ప్రోమోలో ఆకట్టుకుంది. ఈ ఏడాదిలోనే చివరి మ్యాచ్‌ ఆడేసింది సారా ఆ మరుసటి ఏడాదే మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌ వెస్లీ బ్లేక్ ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా సారా మృతి మట్ల డబ్ల్యూడబ్ల్యూఈ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె ఇక లేరనే విషాదకర వార్త తెలిసిందని.. ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపింది. అదే విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్లు సారాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. ‘ ఈ వార్త అబద్ధమైతే బాగుండు.. ఈ విషాదాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’ అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..