స్పాట్ ఫిక్సింగ్ కేసులో.. ఆ క్రికెటర్‌కు 17 నెలల జైలుశిక్ష

| Edited By:

Feb 08, 2020 | 11:31 PM

స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో నేరాన్ని అంగీకరించిన పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ నాసిర్ జంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష విధించబడింది. బ్రిటిష్ జాతీయులైన యూసఫ్ అన్వర్, మహ్మద్ ఇజాజ్ లతో పాటు తోటి క్రికెటర్లకు లంచం ఇచ్చే కుట్రలో తన పాత్రను జంషెడ్ అంగీకరించాడు. అన్వర్‌కు 40 నెలలు, ఇజాజ్‌కి 30 నెలల జీతాలు శిక్ష విధించారు. దుబాయ్‌ వేదికగా 2018 ఫిబ్రవరిలో జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇస్లామాబాద్‌, పెషావర్ జాల్మీ జట్లు పోటీపడ్డాయి. ఈ […]

స్పాట్ ఫిక్సింగ్ కేసులో.. ఆ క్రికెటర్‌కు 17 నెలల జైలుశిక్ష
Follow us on

స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో నేరాన్ని అంగీకరించిన పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ నాసిర్ జంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష విధించబడింది. బ్రిటిష్ జాతీయులైన యూసఫ్ అన్వర్, మహ్మద్ ఇజాజ్ లతో పాటు తోటి క్రికెటర్లకు లంచం ఇచ్చే కుట్రలో తన పాత్రను జంషెడ్ అంగీకరించాడు. అన్వర్‌కు 40 నెలలు, ఇజాజ్‌కి 30 నెలల జీతాలు శిక్ష విధించారు. దుబాయ్‌ వేదికగా 2018 ఫిబ్రవరిలో జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇస్లామాబాద్‌, పెషావర్ జాల్మీ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తోటి ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడేలా జంషెడ్‌ ఉసిగొల్పాడు. నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ విచారణలో ఈ ముగ్గురూ తమ నేరాన్ని అంగీకరించడంతో వారికి శిక్ష పడింది. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అవినీతి నిరోధక శాఖ గతేడాది ఈ కేసులో విచారణ జరిపి జంషెడ్‌పై పదేళ్ల నిషేధం విధించింది.