ఇలా కూడా క్రికెట్ ఆడుతారా!.. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తాన్ ప్లేయర్ ఫోటో..

|

Dec 22, 2020 | 5:27 AM

ఆటలన్నింటిలో ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ తరువాత ఆ స్థాయిలో అభిమానులను కలిగిన ఆట క్రికెట్. క్రికెట్‌ను అభిమానులు ఓ రేంజ్‌లో..

ఇలా కూడా క్రికెట్ ఆడుతారా!.. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తాన్ ప్లేయర్ ఫోటో..
Follow us on

ఆటలన్నింటిలో ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ తరువాత ఆ స్థాయిలో అభిమానులను కలిగిన ఆట క్రికెట్. క్రికెట్‌ను అభిమానులు ఓ రేంజ్‌లో ఆస్వాధిస్తారు. ఏ దేశ ప్లేయర్ అయినా సరే ఆట తీరు నచ్చాలే గాని ఫిదా అయిపోతారు. వారికి అభిమానులుగా మారిపోతారు. ఇక దానికి తగ్గట్లే క్రికెటర్లు కూడా ఆటలో తమ సత్తా చాటుతారు. అంతేకాదు.. ఆటలో వేరియేషన్ కూడా చూపిస్తూ అభిమాలను ముగ్దులను చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా.. అభిమానుల్లో స్థానాన్ని సంపాదించుకుంటారు.

అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ ఫవద్ ఆలమ్ ఆట తీరుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాతో తెగ చెక్కర్లు కొడుతోంది.ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. న్యూజీలాండ్‌-పాకిస్తాన్ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతంది. ఆ మ్యాచ్‌లో ఫవద్ ఆలమ్.. ఎవరూ చేయని విధంగా బ్యాటింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌లా అనిపించినా.. దాన్ని పూర్తిగా అలా పరిగిణనలోకి తీసుకోలేమనే చెప్పాలి. వికెట్లకు దూరంగా ఉండి.. బౌలర్‌కు నేరుగా తన చాతిని కాళ్లను చూపుతూ నిల్చుని బ్యాటింగ్ చేశాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. 233 బంతులు ఆడి 139 పరుగులు చేశాడు. అయితే తొలుత అతని బ్యాటింగ్ సరళిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అతన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఆలమ్ అవేమీ పట్టించుకోలేదు. అదే బ్యాటింగ్ స్టైల్‌తో ఆడిన ఆలమ్.. చివరకు సూపర్ సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరి ఆ బ్యాట్స్‌మెట్ బ్యాటింగ్ శైలి ఎలా ఉందో మీరూ చూడండి.