ఆసీస్‌తో రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులు..విహార్ స్థానంలో జడేజా ..కఠిన క్వారంటైన్‌లో రోహిత్
ఫూర్తి ఫిట్నెస్ సాధిస్తే రెండో టెస్టులో హనుమ విహారిని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలోనే జడ్డూకు చోటు దక్కే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ టెస్టులో ఐదుగురు బౌలర్లకు అవకాశం..
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు టీమిండియా దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులోకి రానున్నాడు. తొలి టీ20లో కంకషన్, తొడ కండర గాయం వల్ల ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే రెండో టెస్టుకు జడ్డూ అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ అనధికారిక సమాచాం.
ఒకవేళ గాయం నుంచి కోలుకుని ఫూర్తి ఫిట్నెస్ సాధిస్తే రెండో టెస్టులో హనుమ విహారిని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలోనే జడ్డూకు చోటు దక్కే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ టెస్టులో ఐదుగురు బౌలర్లకు అవకాశం కల్పించనున్నాట్లుగా తెలుస్తోంది.
సిడ్నీ టెస్టుకు ముందు రోహిత్ శర్మ సాధన మొదలు పెట్టనున్నాడు. అయితే ప్రస్తుతం అతడు సిడ్నీలో కఠిన నిబంధనల అమలు జరుగుతున్నందున క్వారంటైన్‌కు పరమితమయ్యే అవకాశం ఉంది.
ఇక ఆసీస్ జట్టులోనూ కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. వార్నర్, సీన్ అబాట్‌ను సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌కు రప్పించారు. సిడ్నీలో కొత్తగా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. హిట్‌మ్యాన్ అక్కడే ఉన్నా సరే సిడ్నీలో టెస్టు జరగడంపై సీఏ కచ్చితమైన హామీ ఇవ్వడం వల్ల అతడిని వేరే చోటుకు మార్చడం లేదు.