India Vs England 2021-22: ఓవైపు భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుండగానే.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. త్వరలోనే భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టులో 16 మందికి చోటు కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ తన టీమ్ ను ప్రకటించింది. కాగా, మార్చి 12వ తేదీని భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా, ఇంగ్లండ్ టీ20 టీమ్‌కు బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు.
ఇంగ్లండ్ ప్రకటించిన టీ20 జట్టులో ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయీన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జొనాథన్ బెయిర్‌స్టో, శామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కరన్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ ఉన్నారు.
Also read:
గోవాకు ‘సర్కారువారిపాట’ టీం..? దుబాయ్‌లో షూటింగ్ ముగిసినట్లేనా!.. అసలు విషయం ఏంటంటే..