క్రీడల్లో రాణిస్తున్న హీరో తనయుడు.. స్విమ్మింగ్‌లో భారత్‌కు పసిడి పతకం.. ఒలింపిక్స్‌లో స్వర్ణం లక్ష్యమంటున్న మాధవన్ తనయుడు వేదాంత్

|

May 08, 2022 | 1:42 PM

అందరి సినీ నటులకు భిన్నం మాధవన్.. తన తనయుడుని తనకు వారసుడిగా వెండితెరకు పరిచయం చేయాలనుకోలేదు.. క్రీడాకారుడిగా దేశానికి పతకాలను అందించేలా తీర్చిద్దలేకున్నాడు.. నేడు మాధవన్ తన కొడుకు వేదాంత్ స్విమ్మింగ్ లో చేపలా ఈదుతూ.. పతకాల పంట పండిస్తున్నాడు. 16 ఏళ్లకే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

క్రీడల్లో రాణిస్తున్న హీరో తనయుడు.. స్విమ్మింగ్‌లో భారత్‌కు పసిడి పతకం.. ఒలింపిక్స్‌లో స్వర్ణం లక్ష్యమంటున్న మాధవన్ తనయుడు వేదాంత్
R Madhavans Son Vedaant
Follow us on

Madhavan Son Vedaant: జీవితంలో జయాపజయాలను కొన్ని సెకన్లు కూడా నిర్ణయిస్తాయి. ముఖ్యంగా క్రీడాకారులకు విజయాన్నీ కొన్ని మిల్లి సెకన్లు కూడా దూరం చేయగలవు. అందుకనే కాలం గొప్పదనం ఆటగాళ్లకు బాగా తెలుస్తుంది. అందుకనే చివరి క్షణం వరకూ ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో.. పతకం ఎవరికీ సొంతం అవుతుందో తెలియక ఉత్కంఠంగా చూస్తుంటారు క్రీడాభిమానులు. అయితే సినీ నటుడు మాధవన్ తనయుడు వేదాంత్ డానిష్‌ స్విమ్మింగ్‌ ఓపెన్‌లో అద్భుతం చేశాడు. రెప్పపాటులో.. అదీ పది మిల్లీ సెకన్ల తేడాతో బుల్లెట్‌లా దూసుకెళ్లి.. భారతదేశానికి బంగారు  పతకాన్ని అందించాడు.

నటుడు మాధవన్ తనయుడు వేదాంత్ 12 ఏళ్ల వయసులో ఈత కొట్టడం ప్రారంభించాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ బంగారుకొండ. తన దేశానికి పేరు ప్రతిష్టలను అందించేలా బంగారు పతకమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. స్విమ్మింగ్‌ పరిభాషలో చెప్పాలంటే వేదాంత్‌ ఓ ‘గోల్డెన్‌ ఫిష్‌. నీటిలోకి దిగితే.. చేపకూడా వేదాంత్ వేగాన్ని అందుకోలేదు. అంత ఈజీగా నీటిలో ఈదేస్తాడు. తాజాగా ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలను అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

తనయుడు ప్రతిభకు తండ్రి పుత్రోత్సాహం.. 

ఏ తండ్రికైనా తన కొడుకు దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా నడుచుకుంటుంటే.. సంతోషమేకాదు.. పుత్రోత్సాహన్ని అనుభవిస్తున్న మాధవన్.. తన కొడుకు ఈ స్టేజ్ కు చేరుకోవడంలో నా పాత్రకంటే.. తన భార్య సరిత పాత్రనే గొప్ప అని గర్వంగా చెబుతారు. వేదాంత్ ను చిన్న తనం నుంచి లక్ష్యం వైపు పయనించేలా సిద్ధం చేశాం.. తెల్లవారుజామున నాలుగింటికే కొడుకుతో సరిత నిద్ర లేచేది.. స్విమ్మింగ్‌ తీరును గమనిస్తూ తనకు తెలిసిన మెలకువలు చెప్పేది. అనంతర వేదాంత్ ను స్విమ్మింగ్ శిక్షణకు తీసుకెళ్లి, తీసుకురావడం.. చదువు, క్రమశిక్షణ అన్ని బాధ్యతలను తనే చూసుకునేది. కనుక ఇప్పుడు వేదాంత్ ఏమి సాధించినా ఆ క్రెడిట్ తన భార్యదే అని క్రెడిట్ మొత్తం ఇచ్చేస్తారు మాధవన్.

ఒలింపిక్స్‌లో పతకం పై గురి పెట్టిన వేదాంత్. 

కరోనా సమయంలో ఇక్కడ స్మిమ్మింగ్ ఫూల్స్ క్లోజ్ చేయడంతో.. వేదాంత్ శిక్షణ కోసం దుబాయ్ కు తరలి వెళ్లారు. గత రెండేళ్లుగా అక్కడే స్విమ్మింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్ తరపున డెన్మార్క్‌లో డానిష్‌ ఓపెన్‌ -22లో పాల్గొన్నాడు. ఇందులో డబుల్‌ ధమాకా విజయంతో స్వర్ణ, రజత పతకాలను సాధించాడు. అంతేకాదు 16 ఏండ్ల వేదాంత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..