Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. తాజాగా పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో సుధీర్ (Sudhir) భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. గురువారం (ఆగస్టు4) అర్ధరాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో సుధీర్ 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ బంగారు పతకాల సంఖ్య 6కు చేరగా, మొత్తం పతకాల సంఖ్య 20కి చేరుకుంది. ఇందులో 7 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.
HISTORIC GOLD FOR INDIA ???
ఇవి కూడా చదవండిAsian Para-Games Bronze medalist, #Sudhir wins ??’s 1st ever GOLD? medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name ??
Sudhir wins his maiden ? in Men’s Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India
1/1 pic.twitter.com/cBasuHichz— SAI Media (@Media_SAI) August 4, 2022
తడబడినా.. నిలబడి..
కాగా పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు అలాగే అతను ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్‌లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్‌కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు.
?History made.
First-ever gold medal for India in #ParaPowerlifting at the Commonwealth Games!
?? Sudhir took ?in the men’s heavyweight with a new Games Record of 212kg (134.5 points)
?Christian Obichukwu ??
?@MickyYule9???????@WeAreTeamIndia @ParalympicIndia @Team_Scotland pic.twitter.com/me1L6zsDgp— #ParaPowerlifting (@Powerlifting) August 4, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..