Ronaldo vs Messi: క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ లియోనెల్ మెస్సీ.. ఇద్దరిలో ఎవరు ధనవంతుడో తెలుసా ?

Ronaldo vs Messi: ఫుట్‌బాల్ దిగ్గజాల సంపద విషయంలోనూ ఆసక్తికర పోటీ నెలకొంది. 2026 నాటికి క్రిస్టియానో రొనాల్డో నికర ఆస్తి విలువ సుమారు 1.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, లియోనెల్ మెస్సీ ఆస్తి 1.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. వీరిద్దరి మధ్య దాదాపు 100 మిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉండగా, క్లబ్ ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాలు కీలకంగా నిలిచాయి.

Ronaldo vs Messi: క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ లియోనెల్ మెస్సీ.. ఇద్దరిలో ఎవరు ధనవంతుడో తెలుసా ?
Ronaldo Vs Messi

Updated on: Sep 09, 2026 | 8:08 AM

Ronaldo vs Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో దశాబ్ద కాలానికి పైగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల మధ్య మైదానంలోనే కాదు, ఆస్తుల సంపాదనలోనూ ఆసక్తికర పోటీ సాగుతోంది. 2026 నాటికి ఈ ఇద్దరు దిగ్గజాల్లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఉత్సుకత చూపుతున్నారు. ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం.. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంచనా నికర ఆస్తి విలువ దాదాపు 1.2 బిలియన్ డాలర్లు (రూ.10,000 కోట్లకు పైగా)గా ఉంది. 2026 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారుల జాబితాలో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. గత 12 నెలల కాలంలోనే అతడు వివిధ మార్గాల ద్వారా సుమారు 300 మిలియన్ డాలర్లు (రూ.2,500 కోట్లు) ఆర్జించాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్-నసర్ క్లబ్‌తో ఉన్న భారీ కాంట్రాక్ట్ అతడి ఆదాయానికి ప్రధాన మూలంగా నిలిచింది. దీనికి తోడు సొంత సిఆర్7 బ్రాండ్ ఉత్పత్తులు, వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియా ప్రాతినిధ్యం ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చిపడుతోంది.

వేల కోట్ల వ్యాల్యూతో మెస్సీ పోటీ

మరోవైపు అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలిపిన లియోనెల్ మెస్సీ అంచనా ఆస్తి విలువ దాదాపు 1.1 బిలియన్ డాలర్లు (రూ.9,150 కోట్లు). గత 12 నెలల్లో మెస్సీ సంపాదన దాదాపు 140 మిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఇంటర్ మియామీ క్లబ్‌కు ఆడుతున్న మెస్సీకి, పదవీ విరమణ తర్వాత ఆ క్లబ్‌లో భాగస్వామ్య వాటా తీసుకునే అరుదైన అవకాశం ఉంది. అదనంగా, ప్రపంచ ప్రసిద్ధ అడిడాస్ బ్రాండ్‌తో ఉన్న లైఫ్‌టైమ్ ఒప్పందం, ఇతర గ్లోబల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు అతడి ఆర్థిక పునాదిని అత్యంత బలంగా మార్చాయి.

ఇద్దరి మధ్య రూ.850 కోట్ల వ్యత్యాసం

ఆస్తుల పరంగా ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే క్రిస్టియానో రొనాల్డోనే మెస్సీ కంటే ముందంజలో ఉన్నాడు. ఫోర్బ్స్ నివేదికల ప్రకారం రొనాల్డో ఆస్తి 1.2 బిలియన్ డాలర్లు అయితే, మెస్సీ ఆస్తి 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. వీరిద్దరి నికర ఆస్తుల మధ్య దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.850 కోట్లు) వ్యత్యాసం ఉంది. క్రీడాకారుల మార్కెట్ విలువ, క్లబ్ ఒప్పందాలు, వ్యాపార పెట్టుబడులను బట్టి ఈ గణాంకాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

క్రీడ రంగాన్ని శాసిస్తున్న మైండ్ సెట్

క్రీడా రంగంలో ఆటగాళ్లు సంపాదన ద్వారా బిలియనీర్ల జాబితాలో చేరడం అత్యంత అరుదైన విషయం. రొనాల్డో, మెస్సీ కేవలం ఆటకే పరిమితం కాకుండా, తమ బ్రాండ్ వ్యాల్యూను వ్యాపార రంగంలోకి సమర్థవంతంగా మళ్లించారు. చారిత్రక విజయాలతో పాటు ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే అథ్లెట్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us