Watch Video: టార్గెట్ 87.. ఫ్లాపైన బ్యాటర్లు.. గెలిపించిన ప్రత్యర్థి బౌలర్లు.. క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. ఎక్కడంటే?

|

Jan 21, 2023 | 12:03 PM

ICC Under 19 Womens T20 World Cup 2023: తొలి బంతికి వికెట్‌, మూడో బంతికి వికెట్‌, 13వ బంతికి వికెట్‌, ఆ తర్వాత కొద్దిసేపటికే గేమ్‌ ఓవర్‌. అవును, ఓ జట్టు మొత్తం పేకమేడల్లా కుప్పకూలిన సంఘటన నేడు చోటు చేసుకుంది. దీంతో క్రికెట్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది.

Watch Video: టార్గెట్ 87.. ఫ్లాపైన బ్యాటర్లు.. గెలిపించిన ప్రత్యర్థి బౌలర్లు.. క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. ఎక్కడంటే?
Indonesia Womens U19
Follow us on

తొలి బంతికి వికెట్‌, మూడో బంతికి వికెట్‌, 13వ బంతికి వికెట్‌, ఆ తర్వాత కొద్దిసేపటికే గేమ్‌ ఓవర్‌. అవును, ఓ జట్టు మొత్తం పేకమేడల్లా కుప్పకూలిన సంఘటన నేడు చోటు చేసుకుంది. దీంతో క్రికెట్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్ జరిగింది . జింబాబ్వే జట్టు ఇండోనేషియాతో తలపడింది. క్రికెట్ అనుభవాన్ని పరిశీలిస్తే జింబాబ్వే అంటే అందరికీ తెలిసిన పేరు. ఇండోనేషియా ఆ స్థాయిలో రాణించలేదు. కానీ, నేడు సాధించిన విజయం చారిత్రాత్మకంగా పరిగణించబడటానికి ఇదే కారణంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇండోనేషియా తన నిర్ణయం తప్పు అని నిరూపించింది. తొలి బంతి నుంచే ఇండోనేషియా బౌలర్లు జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ను మైదానం వీడడం తప్ప మరో మార్గం లేదన్న రీతిలో చెలరేగిపోయారు.

ఇవి కూడా చదవండి

జింబాబ్వే పరిస్థితి దారుణంగా మారింది..

మ్యాచ్ తొలి బంతికే జింబాబ్వే తొలి వికెట్‌ను ఇండోనేషియా చేజార్చుకుంది. ఆ తర్వాత మ్యాచ్ మూడో బంతికి రెండో వికెట్‌ పడగొట్టింది. దీని తర్వాత మూడో ఓవర్ తొలి బంతికే మూడో దెబ్బ పడింది. కాగా 5వ ఓవర్‌లో అడుగుపెట్టిన తర్వాత నాలుగో దెబ్బ కూడా పడింది. అంటే పవర్ ప్లేలోనే జింబాబ్వే ఓటమికి ఇండోనేషియా ఫుల్ స్ర్కిప్ట్ రాసింది.

ఇండోనేషియా బౌలర్లు ఇచ్చిన తొలి షాక్ ఫలితం జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో పూర్తి 100 పరుగులు కూడా చేయలేకపోయింది. ఇండోనేషియాపై 8 వికెట్లు కోల్పోయి కేవలం 86 పరుగులు చేసి 87 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇండోనేషియా ఘన విజయం..

ఇండోనేషియా మహిళల అండర్ -19 జట్టుకు మంచి అవకాశం వచ్చింది. లక్ష్యం చిన్నది కావడంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని వదులుకోలేదు. జింబాబ్వేపై గెలిచి, మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్‌లో ఇండోనేషియాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

లక్ష్యాన్ని ఛేదించిన ఇండోనేషియాకు కూడా ఆరంభం అంతగా బాగోలేదు. కానీ, విజయంపై దృష్టిని ఏమాత్రం కోల్పోలేదు. బౌలర్ల శ్రమ వృథా కాలేదు. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా జట్టు మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 87 పరుగుల లక్ష్యాన్ని 18వ ఓవర్‌లోనే ఛేదించింది. జింబాబ్వే ఇచ్చిన 25 ఎక్స్‌ట్రాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇది ఇండోనేషియా బ్యాట్స్‌మెన్ చేసిన పరుగుల కంటే ఎక్కువ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..