Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్‌ వీడియో..

|

Feb 11, 2022 | 1:55 PM

తగ్గేదేలే ఇప్పుడు ఎక్కడ చూసిని వినబడుతున్న డైలాగ్. పుష్ప(Pushpa) సినిమా డైలాగ్‌లు, పాటలకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీలు ఫిదా అవుతున్నారు...

Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్‌ వీడియో..
Chahal
Follow us on

తగ్గేదేలే ఇప్పుడు ఎక్కడ చూసిని వినబడుతున్న డైలాగ్. పుష్ప(Pushpa) సినిమా డైలాగ్‌లు, పాటలకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీలు ఫిదా అవుతున్నారు. పుష్ప డైలాగ్స్ చెబుతూ, పాటలు పాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. విదేశాల్లోని ప్రముఖ సింగర్లు, మ్యూజిక్ బ్యాండ్లు సైతం ఈ సినిమాల్లోని పాటలు, డైలాగులను తమదైన శైలిలో రీక్రియేట్ చేస్తున్నారు. ఇక క్రికెట్ ప్రపంచాన్ని ‘పుష్ప’ ఫీవర్ వెంటాడుతోంది. టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా(jadeja), శిఖర్‌ ధావన్‌(Shikar Dhawan), సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్యా , అశ్విన్‌తో పాటు విదేశీ క్రికెటర్లు పుష్పరాజ్‌ను అనుకరిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ అయితే రోజుకో ‘పుష్ప’ వీడియోను షేర్ చేస్తూ ఈ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఇప్పుడు టీమిండియా స్పిన్నర్ చాహల్ (Chahal) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.

చిలిపి ఆటగాళ్లలో ఒకరైన యుజ్వేంద్ర చాహల్ పుష్ప డైలాగ్‌ చెప్పాడు. తగ్గేదేలే అంటూఇన్‌స్టా రీల్ చేశాడు. చాహల్ ‘ఝుకేగా నహీ’ అంటూ డైలాగ్‌ చెప్పాడు. పుష్పలో అల్లు అర్జున్ ఏ విధంగా డైలాగ్ చెప్పాడో చాహల్ అదే విధంగా డైలాగ్ చెప్పాడు. గదవ కింద నుంచి చేయి పైకి లేపుతూ ఝుకేగా నహీ(తగ్గేదేలే) అని డైలాగ్ చెప్పాడు. చాహల్‌ ఇన్‌స్టా రీల్‌పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, టీవీ నటుడు అలీ గోని పోస్ట్‌పై వ్యాఖ్యానించాడు – “ఫిర్ బాల్ కాన్ ఉతయేగా (అప్పుడు బంతిని ఎవరు తీసుకుంటారు)” అని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చాహల్‌ను “కాపీ క్యాట్” అని పిలిచాడు. ” దీన్ని వికెట్ల వేడుకగా మార్చుకోవాలని ఒకరిద్దరు వినియోగదారులు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే చాహల్ రాణిస్తున్నాడు. అల్లు అర్జున్, రష్మిక కలిసి నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Read Also.. IPL 2022 Auction: అన్ని జట్ల చూపు ఈ 5గురు ఫినిషర్లపైనే.. రూ. 10 కోట్లయినా తగ్గేదేలే అంటోన్న ఫ్రాంచైజీలు?