Yuvraj Singh: మరోసారి కెప్టెన్‌గా యువరాజ్.. భారత జట్టులో చేరిన శిఖర్ ధావన్.. బరిలోకి ఎప్పుడంటే?

World Championship of Legends: యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ వంటి భారత క్రికెట్ స్టార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ మొదటి ఎడిషన్‌లో అద్భుతంగా రాణించారు. ఈ క్రికెటర్లకు ఆట పట్ల ఉన్న ప్రేమ, అంకితభావం ఇప్పటికీ బలంగా ఉందని ఇది రుజువు చేసింది.

Yuvraj Singh: మరోసారి కెప్టెన్‌గా యువరాజ్.. భారత జట్టులో చేరిన శిఖర్ ధావన్.. బరిలోకి ఎప్పుడంటే?
Wcl Yuvraj Singh

Updated on: Mar 21, 2025 | 5:20 PM

World Championship of Legends: భారత క్రికెట్ లెజెండ్, “సిక్సర్స్ కింగ్” యువరాజ్ సింగ్ జులైలో ఇంగ్లండ్ వ్యాప్తంగా జరగనున్న EaseMyTrip వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండవ సీజన్‌లో పాల్గొనడాన్ని ధృవీకరించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ తొలి ఎడిషన్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా చేయడంలో యువరాజ్ ఆకట్టకున్న సంగతి తెలిసిందే. ఈసారి, యువరాజ్ సింగ్‌తో పాటు అనుభవజ్ఞుడైన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ కూడా జత కలిశాడు. అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు.

కెప్టెన్‌గా యువరాజ్ సింగ్..

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండవ ఎడిషన్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించడం గురించి యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, “ఈజ్‌మైట్రిప్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో మళ్ళీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి ఎడిషన్ టోర్నమెంట్‌లో నా జట్టు విజయం సాధించిన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాయి” అని అన్నాడు.

ఇవి కూడా చదవండి

మొదటి ఎడిషన్‌లో అద్భుతమైన ప్రదర్శన..

యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ వంటి భారత క్రికెట్ స్టార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ మొదటి ఎడిషన్‌లో అద్భుతంగా రాణించారు. ఈ క్రికెటర్లకు ఆట పట్ల ఉన్న ప్రేమ, అంకితభావం ఇప్పటికీ బలంగా ఉందని ఇది రుజువు చేసింది.

ప్రపంచ వేదికపై భారతీయ దిగ్గజాల ప్రదర్శన..

భారత అభిమానులు తమ క్రికెట్ దిగ్గజాలు ప్రపంచ వేదికపై మరోసారి అద్భుతంగా ప్రదర్శన ఇవ్వడం వీక్షించారు. దీంతో ఈ టోర్నమెంట్ త్వరగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కారణంగా, ఈ టోర్నమెంట్ రెండవ సీజన్‌లో కూడా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..