Video: రోడ్డుపై చిన్న గొడవ.. కట్‌చేస్తే.. 2011 ప్రపంచకప్ విజేత బంధువులు అరెస్ట్..!

TMC MP Yusuf Pathan Family Controversy: 2011 ప్రపంచకప్ విజేత, టీమిండియా మాజీ ప్లేయర్ యూసుఫ్ పఠాన్ బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై మొదలైన చిన్న గొడవ.. ఆ తర్వాత రచ్చరచ్చగా మారడంతో పోలీసుల చెంతకు చేరింది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

Video: రోడ్డుపై చిన్న గొడవ.. కట్‌చేస్తే.. 2011 ప్రపంచకప్ విజేత బంధువులు అరెస్ట్..!
Yusuf Pathan Father In Law Arrest

Updated on: Apr 21, 2026 | 3:51 PM

Yusuf Pathan Father in Law Arrest: భారత మాజీ క్రికెటర్, 2011 ప్రపంచకప్ హీరో యూసుఫ్ పఠాన్ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. ముంబైలోని బైకుల్లాలో జరిగిన ఒక చిన్న రోడ్డు గొడవ చిలికి చిలికి గాలివానలా మారి, భౌతిక దాడికి దారితీసింది. ఈ ఘటనలో పఠాన్ మామ, బావమరిదిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం క్రీడా, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో యూసుఫ్ ఖాన్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా, రోడ్డుపై ఉన్న గుంతలోని నీరు ప్రమాదవశాత్తు షోయబ్ ఖాన్ అనే వ్యక్తిపై పడింది. దీనిపై యూసుఫ్ ఖాన్ వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ, షోయబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం కాసేపటికే దాడుల వరకు వెళ్లింది. షోయబ్ ఖాన్ వెదురు కర్రతో యూసుఫ్ ఖాన్ కారు అద్దాన్ని పగలగొట్టి, అతనిపై దుర్భాషలాడుతూ దాడికి దిగాడు.

రెండోసారి దాడి.. తీవ్ర గాయాలు..

ఈ ఘటనపై బాధితుడు యూసుఫ్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, మార్గమధ్యలో యూసుఫ్ పఠాన్ మామ ఖలీద్ ఖాన్, అతని అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఖలీద్ ఖాన్ బృందం బేస్ బాల్ బ్యాట్లు, వెదురు కర్రలతో బాధితులపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఒక వ్యక్తి చేయి విరగడమే కాకుండా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: Virat Kohli: క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అరుదైన ప్రపంచ రికార్డ్ భయ్యో..!

పోలీసుల చర్యలు, అరెస్టులు..

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, సాక్షుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో యూసుఫ్ పఠాన్ మామ ఖలీద్ ఖాన్, బావమరిది షోయబ్ ఖాన్ ఉన్నారు. వివిధ సెక్షన్ల కింద హత్యాప్రయత్నం, దాడి, మారణాయుధాల వినియోగం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మౌనంగానే యూసుఫ్ పఠాన్..

ఈ వివాదంపై మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. పఠాన్ 2013లో ఆఫ్రీన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆఫ్రీన్ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం పఠాన్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున బెహరాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించాడు. తన కుటుంబ సభ్యులు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోవడం పట్ల ఆయన ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: IPL 2026: ‘లైఫ్ లైన్’ ఇచ్చిన మ్యాజిక్.. కేకేఆర్ ప్లేఆఫ్ చేరాలంటే ఇలా జరగాల్సిందేనయ్యో..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us