Year Ender 2021: ఆ లిస్టులో భారత ప్లేయర్లకు నో ప్లేస్.. టాప్ 5లో ఎవరున్నారంటే‎?

|

Dec 19, 2021 | 12:57 PM

Most centuries in 2021: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 6 సెంచరీలు సాధించాడు. 2021లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Year Ender 2021: ఆ లిస్టులో భారత ప్లేయర్లకు నో ప్లేస్.. టాప్ 5లో ఎవరున్నారంటే‎?
Joe Root
Follow us on

Year Ender 2021: ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ జో రూట్ బ్యాట్ ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించాడు. ఈ ఏడాది అతిపెద్ద ఇన్నింగ్స్‌ కూడా అతనిదే కావడం విశేషం. రూట్ 2021 సంవత్సరంలో అత్యధికంగా 6 సెంచరీలు చేశాడు. ఈ సెంచరీలన్నీ టెస్టుల్లోనే సాధించాడు. రూట్‌తో పాటు, ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 లిస్టులో ఎవరున్నారో చూద్దాం..

1. జో రూట్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది 17 అంతర్జాతీయ మ్యాచ్‌లు (టెస్ట్, వన్డే, టీ20) ఆడాడు. అతను 72 సగటుతో 1700 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ ఏడాది రూట్‌ పేరిట 6 సెంచరీలు ఉన్నాయి. అడిలైడ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్‌తో పాటు ఏడాది చివర్లో జరిగే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో అతను ఈ సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం ఉంది.

2. పీఆర్ స్టెర్లింగ్: ఈ ఐరిష్ ఆటగాడు 2021 సంవత్సరంలో 4 సెంచరీలు చేశాడు. స్టెర్లింగ్ 28 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 46 సగటుతో 1151 పరుగులు చేశాడు. ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

3. కరుణరత్నే: శ్రీలంకకు చెందిన కరుణరత్నే ఈ ఏడాది 4 సెంచరీలు సాధించాడు. అతను 10 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 57 పరుగుల సగటుతో 986 పరుగులు సాధించాడు.

4. బాబర్ అజం: ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నాలుగో స్థానంలో నిలిచాడు. 3 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది మొత్తం 43 మ్యాచ్‌లు ఆడగా, ఎక్కువగా టీ20ల్లోనే బరిలోకి దిగాడు. మొత్తం 1760 పరుగులు చేసిన బాబర్ 14 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

5. ఫవాద్ ఆలం: ఈ ఏడాది 9 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు చేసిన ఈ పాకిస్థానీ బ్యాట్స్‌మెన్ టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఫవాద్ ఈ ఏడాది 49 సగటుతో 571 పరుగులు చేశాడు.

Also Read: Watch Video: అది నోబాల్ కాదు.. డెడ్ బాల్ అసలే కాదు.. బ్యాటర్ మాత్రం క్లీన్‌బౌల్డ్.. కానీ, నాటౌట్‌‌.. ఎందుకో తెలుసా?

Year Ender 2021: తేలిపోయిన అంతర్జాతీయ ఓపెనర్లు.. రోహిత్ శర్మ ముందు అంతా డీలా.. ఈ ఏడాది ఆ లిస్టులో మనోడే నంబర్ వన్‌..!