IND vs AUS 2nd T20I: 9 ఫోర్లు, 2 సిక్సులు.. 220 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను కంగారెత్తించిన జైస్వాల్..

|

Nov 26, 2023 | 7:51 PM

India vs Australia 2nd T20I: ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా 5.5 ఓవర్లలో ఒవ వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 53 (25 బంతులు, 9 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కేవలం 24 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, 220 స్ట్రైక్ రేట్‌తో ఆస్ట్రేలియా బౌలర్లపై ఊచకోత కోశాడు. ఈ క్రమంలో షాన్ అబాట్ వేసిన ఒక ఓవర్లో 3 ఫోర్లు, 2 సిక్సులు బాది ఆ ఓవర్ నుంచి మొత్తం 24 పరుగులు రాబట్టాడు.

IND vs AUS 2nd T20I: 9 ఫోర్లు, 2 సిక్సులు.. 220 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను కంగారెత్తించిన జైస్వాల్..
Yashashvi Jaiswal
Follow us on

Yashasvi Jaiswal: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా 5.5 ఓవర్లలో ఒవ వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 53 (25 బంతులు, 9 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కేవలం 24 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, 220 స్ట్రైక్ రేట్‌తో ఆస్ట్రేలియా బౌలర్లపై ఊచకోత కోశాడు. ఈ క్రమంలో షాన్ అబాట్ వేసిన ఒక ఓవర్లో 3 ఫోర్లు, 2 సిక్సులు బాది ఆ ఓవర్ నుంచి మొత్తం 24 పరుగులు రాబట్టాడు.

ఇవి కూడా చదవండి

టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు..

82/2 vs స్కాట్లాండ్, దుబాయ్, 2021

78/2 vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2018

77/1 vs ఆస్ట్రేలియా, తిరువనంతపురం, 2023

77/1 vs శ్రీలంక, నాగ్‌పూర్, 2009

76/1 vs న్యూజిలాండ్, జోహన్నెస్‌బర్గ్, 2007

74/1 vs ఆస్ట్రేలియా, సిడ్నీ, 2016.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(w/c), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..