WWE సూపర్ స్టార్ జాన్ సెనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భారతీయ ప్రముఖుల చిత్రాలను పంచుకుంటున్నాడు. ఈసారి అతని పోస్ట్‌లో భారత మాజీ కెప్టెన్ MS ధోనీ ఫొటో షేర్ చేశాడు. అతను టీ20 ప్రపంచ కప్ 2021కి సంబంధించిన ఫొటో షేరు చేశారు. ఇక్కడ ధోని టీమ్ ఇండియా మెంటార్ ఉన్నాడు. మెన్ ఇన్ బ్లూ టోర్నమెంట్‌లో నాకౌట్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్లతో పరాజయం పాలైంది. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా సెమీస్‌కు చేరలేకపోయింది.
జాన్ సెనా తరచుగా భారతీయ సెలబ్రిటీల ఫొటోలు పోస్ట్‌లను పంచుకుంటుంటాడు. ధోని తన పోస్ట్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. గతంలో సెనా పోస్ట్‌లలో విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ చాలా మంది కనిపించారు. WWE లెజెండ్ జాన్ సెనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 16.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 16-సార్ల ప్రపంచ ఛాంపియన్దా నిలిచిన సెనా మనీ ఇన్ బ్యాంక్ 2021 తర్వాత WWEకి చాలా ఎదురుచూస్తున్నాడు.
జాన్ సెనా మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో టెలివిజన్ కాని మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అప్పటి నుంచి యాక్షన్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి సమయం నటన మీద పెడుతున్నాడు. భారత మాజీ కెప్టెన్ తన ఫ్యామీలితో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫును ఆడుతున్నాడు. ధోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. అతను బహిరంగంగా కనిపంచడం చాలా తక్కువ. అతను ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
Read Also.. AUS vs NZ Final: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టేనా.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో గెలుపు ఎవరిది..