WPL 2025, GGW vs UPWW : యాష్లే గార్డ్​నర్ ఆల్‌రౌండ్ షో.. యూపీని చిత్తు చేసిన గుజరాత్

మహిళల ప్రీమియర్ లీగ్-2025లో గుజరాత్ జెయింట్స్​ బోణీ కొట్టింది. ఆదివారం (ఫిబ్రవరి 16) రాత్రి యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్ లో గుజరాత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

WPL 2025, GGW vs UPWW : యాష్లే గార్డ్​నర్ ఆల్‌రౌండ్ షో.. యూపీని చిత్తు చేసిన గుజరాత్
Gujarat Giants Women

Updated on: Feb 17, 2025 | 6:20 AM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మూడవ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో UP వారియర్స్‌ను ఓడించింది టోర్నీలో మొదటి విజయం సాధించింది.. గుజరాత్ జెయింట్స్ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ జెయింట్స్ 12 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. 18 ఓవర్లలో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి విజయం సాధించింది గుజరాత్. వడోదరలోని కోటంబి స్టేడియం లో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. కాగా రెండో మ్యాచుల్లో గుజరాత్‌కు ఇది తొలి విజయం. అంతకు ముందు ఫిబ్రవరి 14న బెంగళూరు చేతిలో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ కు శుభారంభం లభించలేదు. బెత్ మూనీ, దయాళన్ హేమలత ఇద్దరూ డకౌట్ అయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి గుజరాత్ ను గెలిపించారు. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. లారా వోల్వార్డ్ 22 పరుగులు చేసింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్, డిఆండ్రా డాటిన్ ఐదో వికెట్‌కు 58 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్లీన్ 30 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. డిఆండ్రా డాటిన్ 18 బంతుల్లో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. యూపీ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ 2 వికెట్లు పడగొట్టింది. గ్రేస్ హారిస్, తహిలా మెక్‌గ్రాత్ ఇద్దరూ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఆ జట్టులో చాలా మంది బ్యాటర్లు బాగానే ఆడినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ తరఫున ప్రియా మిశ్రా 3 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టింది. కెప్టెన్ ఆష్లే గార్డనర్, డిఆండ్రా డాటిన్ ఇద్దరూ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కాశ్వి గౌతమ్ 1 వికెట్ పడగొట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..