IND Vs AUS: అదే జరిగితే.. నేరుగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు.. ఆస్ట్రేలియా ఇంటికి!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు అందరిలోనూ ఒకటే ప్రశ్న. 4 టెస్టుల ఈ సిరీస్‌లో కనీసం మూడింటిలోనైనా టీమిండియా..

IND Vs AUS: అదే జరిగితే.. నేరుగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు.. ఆస్ట్రేలియా ఇంటికి!
Ind Vs Aus

Updated on: Feb 21, 2023 | 4:46 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు అందరిలోనూ ఒకటే ప్రశ్న. 4 టెస్టుల ఈ సిరీస్‌లో కనీసం మూడింటిలోనైనా టీమిండియా గెలుపొంది.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుతుందా.? అయితే ఇప్పుడు సిరీస్‌ సగం పూర్తయ్యింది. ఈసారి కూడా అదే ప్రశ్న.. కానీ టీమిండియా స్థానాన్ని ఆస్ట్రేలియా భర్తీ చేసింది. జూన్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ వేదికగా జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆడటంపై టీమిండియా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం ఇంటి ముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఆసీస్ ఆటగాళ్ల ఆటతీరు చూస్తుంటే.. ఫైనల్ టిక్కెట్ దక్కుతుందా.? లేదా.? అన్నది ప్రశ్నగా మారింది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఆసీస్ చేరాలంటే.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.?

  • డబ్ల్యూటీసీ ఫైనల్స్ సమీకరణం 1:

ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 66.67 శాతంతో అగ్రస్థానంలో ఉంది. మరో రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఓడిపోతే గెలుపు శాతం తగ్గి టీమ్ ఇండియా అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇక న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంటే.. భారత్, శ్రీలంక మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరుగుతుంది. అదే లంకేయులు.. 0-2తో కివీస్ చేతిలో ఓడితే.. భారత్, ఆసీస్ ఫైనల్స్ ఆడతాయి.

  • డబ్ల్యూటీసీ ఫైనల్స్ సమీకరణం 2:

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరో టెస్ట్ గెలిస్తే చాలు.. టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో చోటు దక్కడం ఖాయం. ఈ 4 టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0 లేదా 3-1 తేడాతో టీమిండియా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. అలాగే ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోతే.. న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ సిరీస్ లెక్కలపై.. ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆధారపడి ఉంటుంది.

  • డబ్ల్యూటీసీ ఫైనల్స్ సమీకరణం 3:

ఈ సిరీస్‌లోని తదుపరి రెండు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయినా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుకుంటుంది. దీని కోసం, శ్రీలంక, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో లంకేయులు కనీసం ఒక టెస్టులోనైనా ఓడిపోవాల్సిన అవసరం ఉంది.

  • డబ్ల్యూటీసీ ఫైనల్స్ సమీకరణం 4:

ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియాపై 4-0 టీమిండియా వైట్‌వాష్ చేస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ నుంచి ఆసీస్ ఇంటికి.. భారత్ టోర్నమెంట్‌కి వెళ్తుంది. శ్రీలంకకు ఛాన్స్ లభిస్తుంది.