
చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా తరఫున 85 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. ఇక గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు. తాజాగా రిలీజైన వన్డే బ్యాటర్ల జాబితాలో విరాట్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఆస్ట్రేలియాపై అజేయంగా 97 పరుగులు చేసిన రాహుల్.. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్నాడు.ఇక ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా నయా సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా బాబర్, గిల్‌కు కేవలం 5 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. అయితే ఆసియా కప్‌లో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్‌లో పూర్తిగా తేలిపోతున్నాడు. వికెట్లు తీయలేకపోతున్నాడు. పైగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. తాజాగా విడుదలైన ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో సిరాజ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా టాప్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-40లో ఉన్నాడు.
ఇక ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 11 స్థానాలు ఎగబాకి ప్రస్తుతం 21వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కాగా, న్యూఢిల్లీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 100 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 140 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ ఏడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకోగా, పాకిస్థాన్‌కు చెందిన ఇమామ్ ఉల్ హక్ మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..