IND vs NZ: హార్దిక్‌ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ఆడడంపై ఏమందంటే?

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అదే ఓవర్ మూడో బంతికి ఫాలో త్రూలో బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా గాయపడ్డాడు. పాండ్యా బౌలింగ్‌ చేసేందుకు ప్రయత్నించాడు కానీ నొప్పి ఎక్కువవ కావడంతో మైదా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని ఎన్‌సీఏలో చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం అతని ఎడమ కాలి మడమను పరీక్షించింది.

IND vs NZ: హార్దిక్‌ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ఆడడంపై ఏమందంటే?
Hardik Pandya

Updated on: Oct 21, 2023 | 9:54 AM

వన్డే ప్రపంచకప్ నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆడనున్న రోహిత్ పాడే జట్టు వైస్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగనుంది. గురువారం (అక్టోబర్‌ 20) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్దిక్ పాండ్యా కివీస్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ సమాచారం. ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే ఈసారి కివీస్‌పై గెలిచి చరిత్రను తిరగరాయానుకుంది టీమిండియా. అయితే  గాయం కారణంగా పాండ్యా అందుబాటులో లేకపోవడం ఆ రికార్డును బద్దలు కొట్టాలనే ఆలోచనలో ఉన్న భారత జట్టుకు ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. కాగా హార్దిక్ పాండ్యాకు ఇప్పుడు ఇంగ్లండ్‌కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు చికిత్స అందించనున్నట్లు సమాచారం. పాండ్యాను పూణే నుంచి నేరుగా బెంగళూరుకు పంపించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మరోవైపు టీమ్ ఇండియాలోని మిగిలిన ఆటగాళ్లు పూణె నుండి ధర్మశాలకు చేరుకున్నారు. అక్కడ అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఇంగ్లండ్ తో మ్యాచ్ కు జట్టులో  చేరే అవకాశం

కాగా బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అదే ఓవర్ మూడో బంతికి ఫాలో త్రూలో బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా గాయపడ్డాడు. పాండ్యా బౌలింగ్‌ చేసేందుకు ప్రయత్నించాడు కానీ నొప్పి ఎక్కువవ కావడంతో మైదా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని ఎన్‌సీఏలో చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం అతని ఎడమ కాలి మడమను పరీక్షించింది. ఇంజెక్షన్ చేసిన తర్వాత అతని పరిస్థితి కాస్త మెరుగైందని చెప్పవచ్చు. పాండ్యా గాయంపై బీసీసీఐ ఇంగ్లండ్ స్పెషలిస్ట్ వైద్యుడిని కూడా సంప్రదించింది. ఇంజక్షన్ కూడా ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. అయితే పాండ్యా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడడని క్లియర్‌గా తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. నం విడిచి వెళ్లాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

హర్దిక్ గాయంపై ఆందోళనలో ఫ్యాన్స్..

న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..