Womens World Cup Final : ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే కూడా రద్దైతే ట్రోఫీ ఎవరికి ఇస్తారు?

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత మహిళల జట్టు, సౌతాఫ్రికా మహిళల జట్టు మధ్య ఈ టైటిల్ పోరు జరగనుంది. అయితే, ఈ చారిత్రక మ్యాచ్‌పై ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్రకు ఎల్లో అలర్ట్ జారీ అయినందువల్ల ఫైనల్ రోజు (ఆదివారం), రిజర్వ్ డే (సోమవారం) నాడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Womens World Cup Final  : ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే కూడా రద్దైతే ట్రోఫీ ఎవరికి ఇస్తారు?
Womens World Cup Final (1)

Updated on: Nov 01, 2025 | 2:02 PM

Womens World Cup Final : మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత మహిళల జట్టు, సౌతాఫ్రికా మహిళల జట్టు మధ్య ఈ టైటిల్ పోరు జరగనుంది. అయితే, ఈ చారిత్రక మ్యాచ్‌పై ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్రకు ఎల్లో అలర్ట్ జారీ అయినందువల్ల ఫైనల్ రోజు (ఆదివారం), రిజర్వ్ డే (సోమవారం) నాడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్‌ జరగకపోతే ట్రోఫీని ఏ జట్టుకు ఇస్తారు? ఐసీసీ నిబంధనలు ఏమి చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే ఈసారి ఫైనల్ ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఈసారి ప్రపంచ కప్ ఫైనల్‌లో సంప్రదాయ అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ లేవు. ఈసారి ఫైనల్‌కు చేరిన భారత జట్టు, సౌతాఫ్రికా జట్టు రెండూ ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్‌ను గెలవలేదు. భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్ ఆడబోతోంది. కాబట్టి, విజేత ఎవరైనా కొత్త ప్రపంచ ఛాంపియన్‌ ఖాయం.

డీవై పాటిల్ స్టేడియంలోనే జరిగిన సెమీఫైనల్‌లో జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్‌తో భారత్, 7 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించింది. మరో సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చింది. నవీ ముంబై, డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 2) మధ్యాహ్నం 3 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మహారాష్ట్రలోని ముంబై, పరిసర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీని కారణంగా వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం.. ఆదివారం మ్యాచ్ రోజున 63 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య 50 శాతం వర్ష సూచన ఉంది. గతంలో ఇదే స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.

ఫైనల్ మ్యాచ్‌ కోసం ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. ఆదివారం మ్యాచ్ జరగకపోతే, సోమవారం (నవంబర్ 3) రోజున మిగిలిన ఆట కొనసాగుతుంది. ఆదివారం రోజున మ్యాచ్ మధ్యలో ఎక్కడైతే ఆగిపోతుందో, రిజర్వ్ డే రోజున అక్కడి నుంచే ఆట కొనసాగుతుంది. ప్రధాన ఉద్దేశం, 50 ఓవర్ల మ్యాచ్‌ను పూర్తి చేయడమే. ఒకవేళ ఆదివారం, సోమవారం రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడితే (కనీసం ఓవర్ల కోతతో కూడా సాధ్యం కాకపోతే), ఐసీసీ నిబంధనల ప్రకారం భారత మహిళా జట్టు, సౌతాఫ్రికా మహిళా జట్టులను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..