WPL Auction 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందంటే?

|

Nov 24, 2023 | 10:12 PM

WPL Auction 2024: WPL 2024 కోసం వేలం జరిగే ఏరియా, తేదీలు వెల్లడయ్యాయి. మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ వేలం డిసెంబర్ 9న ముంబైలో జరగనుంది. అన్ని జట్లు ఇప్పటికే అక్టోబర్ 19 న తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. చాలా మంది కీలక పేయర్లను కూడా విడుదల చేశాయి. టోర్నమెంట్‌లో పాల్గొన్న ఐదు ఫ్రాంచైజీలు మొత్తం 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఇందులో 21 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

WPL Auction 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందంటే?
Wpl 2023
Follow us on

WPL Auction Date And Venue: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం తేదీ వెల్లడైంది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలం డిసెంబర్ 9న జరగాల్సి ఉంది. అదే సమయంలో ముంబై ఈ వేలానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ వేలంలో చాలా మంది మహిళా క్రీడాకారులపై డబ్బుల వర్షం కురవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సహా దాదాపు అన్ని జట్లూ ఈ వేలానికి సిద్ధంగా ఉన్నాయి. అంతకుముందు, మొత్తం 60 మంది ఆటగాళ్లను జట్లు అట్టిపెట్టుకున్నాయి. అయితే చాలా మంది కీలక ఆటగాళ్లను విడుదల చేయాలని జట్లు నిర్ణయించుకున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్ కౌర్, అమంజోత్ కౌర్‌లను రిటైన్ చేసింది. కాగా, యూపీ వారియర్స్ అలిస్సా హీలీ, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్‌లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు అలిస్ పెర్రీ, హీథర్ నైట్, రేణుకా సింగ్‌లను బెంగళూరు రిటైన్ చేసింది. కాగా, అన్నాబెల్ సదర్లాండ్‌ను విడుదల చేయాలని గుజరాత్ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్:

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, ఇసాబెల్లె వాంగ్, జింటిమణి కలితా, నటాలీ స్కివర్, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యాస్తికా భాటియా.

విడుదలైన ఆటగాళ్లు: ధారా గుజ్జర్, హీథర్ గ్రాహం, నీలం బిష్త్, సోనమ్ యాదవ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

నిలబెట్టుకున్న ప్లేయర్లు: ఆశా శోభన, దిశా కస్సట్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, ఇంద్రాణి రాయ్, కనికా అహుజా, రేణుకా సింగ్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన, సోఫీ డివైన్.

విడుదలైన ఆటగాళ్లు: డేన్ వాన్ నీకెర్క్, ఎరిన్ బర్న్స్, కోమల్ జంజాద్, మేగాన్ షుట్, పూనమ్ ఖేమ్నార్, ప్రీతి బోస్, సహానా పవార్.

UP వారియర్స్:

నిలబెట్టుకున్న క్రీడాకారులు: అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్శ్వి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్, ఎస్. యశశ్రీ, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్.

విడుదలైన క్రీడాకారులు: దేవికా వైద్య, షబ్నిమ్ ఇస్మాయిల్, శివలీ షిండే, సిమ్రాన్ షేక్.

ఢిల్లీ క్యాపిటల్స్:

నిలబెట్టుకున్న ఆటగాళ్లు: అలిస్ క్యాప్సే, అరుంధతీ రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాథన్, లారా హారిస్, మరిజన్ కాప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, షైఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తాన్యా భాటియా, టిటాస్ సాధు.

విడుదలైన క్రీడాకారులు: అపర్ణ మండల్, జసియా అక్తర్, తారా నోరిస్.

గుజరాత్ జెయింట్స్:

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: ఆష్లే గార్డనర్, బెత్ మూనీ, దయాలన్ హేమ్లత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, స్నేహ్ రాణా, తనూజా కన్వర్.

విడుదలైన క్రీడాకారులు: అన్నాబెల్ సదర్లాండ్, అశ్వనీ కుమారి, జార్జియా వేర్‌హామ్, హర్లీ గాలా, కిమ్ గార్త్, మాన్సీ జోషి, మోనికా పటేల్, పరునికా సిసోడియా, సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, సుష్మా వర్మ.

మరిన్ని క్రీడా కార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..