Video: స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్.. పిల్లలను కాపాడబోయి.. లైఫ్‌‌నే రిస్క్‌లో పెట్టిన రూ.2.80 కోట్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్..

|

Mar 27, 2023 | 6:16 PM

Rovman Powell Viral Video: వెస్టిండీస్ టీ20 జట్టు కెప్టెన్, రోవ్‌మాన్ పావెల్ రెండవ టీ20 మ్యాచ్‌లో ఇద్దరు పిల్లలను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణ్ణంగా పెట్టాడు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Video: స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్.. పిల్లలను కాపాడబోయి.. లైఫ్‌‌నే రిస్క్‌లో పెట్టిన రూ.2.80 కోట్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్..
Rovman Powell Viral Video
Follow us on

South Africa Vs West Indies Trending Video: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు చేసిన తర్వాత కూడా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా ఏడు బంతుల ముందే ఈ లక్ష్యాన్ని సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20లో ఛేజింగ్‌లో ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. అయితే, విండీస్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ, ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ హృదయాన్ని గెలుచుకునే పని చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

ఈ మ్యాచ్‌లో పావెల్ 19 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేశాడు. తన బ్యాట్‌తో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. పావెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. రూ. 2.80 కోట్లకు ఢిల్లీ టీం ఈ ఆటగాడిని దక్కించుకుంది. IPL-2023లో పావెల్ తన తుఫాను అవతార్‌ను చూపించాలని ఢిల్లీ ఆశిస్తుంది.

ఇవి కూడా చదవండి

పిల్లలను కాపాడబోయి ప్రమాదంలో చిక్కుకున్నాడు..

ఈ విండీస్ ప్లేయర్ పిల్లలను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణ్ణంగా పెట్టాడు. సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని ఛేదించే పనిలో నిమగ్నమైంది. ఇంతలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్‌తో బంతి బౌండరీకి వెళ్లగా.. పావెల్ బంతిని ఆపేందుకు పరుగు లంఖించుకున్నాడు. అయితే, బాల్ బౌండరీకి వెళ్తుంది. అదే లైన్‌లో అక్కడ ఇద్దరు బాల్ బాయ్స్ బౌండరీపై నిలబడి ఉన్నారు. వారిలో ఒకరి వయస్సు దాదాపు 4 నుంచి 5 ఏళ్లలోపే ఉంటుంది. బాల్ బౌండరీ దగ్గరికి వెళుతుండగా, బాల్ బాయ్ బంతిని పట్టుకుంనేందుకు బౌండరీకి చేరాడు. అదే సమయంలో పావెల్ ఆ చిన్నారిపై పడతానేమో అనుకుని, ఆ చిన్నారిని రక్షించి బౌండరీలోకి చొచ్చుకెళ్లాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌ బయట పెట్టిన ఎల్‌ఈడీ బోర్డులను గట్టిగా తాకాడు. పావెల్ తన ప్రాణాలను కూడా ఫణ్ణంగా పెట్టి చిన్న పిల్లవాడితోపాటు అతని వెనుక కూర్చున్న మరో బాల్ బాయ్‌ని రక్షించగలిగాడు.

మ్యాచ్‌లో పరుగుల వర్షం..

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్స్ భారీగా పరుగుల వర్షం కురిపించారు. వెస్టిండీస్ తరపున జాన్సన్ చార్లెస్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, వెస్టిండీస్ తరపున టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 46 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 11 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు. అయితే క్వింటన్ డికాక్ 44 బంతుల్లో 100 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..