ఆ టీమ్‌ ఫైనల్‌కి వస్తే.. RCBకి కప్పు కష్టమే..! గట్టి వార్నింగ్‌ ఇచ్చిన అశ్విన్‌.. ఫ్యాన్స్‌లో గుబులు

ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. అయితే, అశ్విన్ ముంబై ఇండియన్స్ ఫైనల్‌లో ఆర్సీబీని ఓడించే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. ఆర్సీబీ ట్రోఫీ గెలవాలంటే ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరకుండా ఉండటం ముఖ్యం రవిచంద్రన్ అశ్విన్ అతను అభిప్రాయ పడ్డాడు.

ఆ టీమ్‌ ఫైనల్‌కి వస్తే.. RCBకి కప్పు కష్టమే..!  గట్టి వార్నింగ్‌ ఇచ్చిన అశ్విన్‌.. ఫ్యాన్స్‌లో గుబులు
Rcb And Ashwin

Updated on: May 30, 2025 | 11:53 AM

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి కప్పు కొట్టాలనే కలకు కోహ్లీ అండ్‌ కో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే.. ఆర్సీబీతో ఫైనల్‌లో పోటీ పడే జట్టు ఏదో తెలియాలంటే మరో రెండు మ్యాచ్‌ల వరకు ఆగాల్సిందే. ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఎలిమినేటర్‌లో జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. క్వాలిఫైయర్‌ 2లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. అందులో గెలిచిన టీమ్‌ ఫైనల్‌ ఆడనుంది. అయితే అశ్విన్‌ ప్రకారం.. ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌కు వస్తే మాత్రం ఆర్సీబీకి కప్పు కష్టమే అంటూ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. గురువారం ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ నాలుగో సారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మాత్రమే ఫైనల్‌లో ఆర్సీబీని ఓడించగలదని భావిస్తున్నట్లు అశ్విన్‌ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో లీగ్ దశలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఒక్కసారి మాత్రమే తలపడ్డాయని, వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది.

ఆర్సీబీ ఐపీఎల్‌ ట్రోఫీ గెలవాలంటే, గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌పై గెలవాలి. ఎంఐ ఫైనల్‌కు రాకుండా వారిని ఆపాలి అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ‘ఆష్ కి బాత్’లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య జరిగిన క్వాలిఫయర్ 1ని విశ్లేషిస్తూ పేర్కొన్నాడు. ఫైనల్‌లో ఆర్సీబీని ఓడించగల టీమ్‌ ఒక్క ముంబై మాత్రమే, ప్రస్తుతం ఆర్సీబీ హాఫ్‌ ఫేవరేట్‌గా కనిపిస్తున్నా.. క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు. ఒక ఆర్సీబీ ట్రోఫీ గెలవాలంటే.. ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడాలని కోరకుంటానంటూ అశ్విన్‌ తన మనసులో మాట బయటపెట్టాడు.

ఇది ఆర్సీబీ నామ సంవత్సరం..

2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్, 2024లో టీ20 ప్రపంచ కప్‌, ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ప్రస్తావించాడు. ఆ టోర్నీ మేజర్‌ టోర్నీల్లోనూ విరాట్‌ కోహ్లీ భాగం అయ్యాడని, అదే కంటిన్యూ అయితే ఈ సారి ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుందని అశ్విన్‌ అన్నాడు. “నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ గురించి నేను చెప్పదలచుకోలేదు, కానీ ఇది ఆర్సీబీ సంవత్సరం అని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అశ్విన్‌ అన్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..