Dinesh Karthik: టీమిండియాలో దినేష్ కార్తీక్ రీ ఎంట్రీ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, అవకాశం మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం టీమిండియా యంగ్ ప్లేయర్లతోపాటు సీనియర్ ప్లేయర్లతో రెండు జట్లుగా విడిపోయి రెండు వేర్వేరు సిరీస్‌లు ఆడేందుకు రెడీ అయ్యాయని తెలిసిందే. టీమిండియాలో చోటు కోసం ఎంతోమంది ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తనక మరో ఛాన్స్ ఇవ్వాలని భారత సెలెక్టర్లని కోరుతున్నాడు. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన దినేష్ కార్తీక్.. అప్పటి నుంచి మరలా టీంలో కనిపించలేదు. మరోవైపు కామెంటేటర్ గా మరో ఇన్నింగ్స్ ఆరభించిన దినేష్ కార్తీక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కామెంట్రీ కోసం ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ దినేశ్ కార్తీక్ కామెంట్రీ చేయనున్నాడు. అయితే, టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా దుమ్ములేపుతోన్న రిషభ్ పంత్ రాకతో.. దినేష్ కార్తిక్‌కి అవకాశాలు కష్టంగా మారిపోయాయి. మూడు ఫార్మెట్లకు రిషభ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. ఇక టీమిండియాలో దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.
టీమిండియాలో తన అవకాశాలపై మాట్లాడుడూ.. ‘‘నేను ఫిట్‌నెస్‌తో ఉన్నన్ని రోజులు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. 2019 వన్డే ప్రపంచకప్‌లో నాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, నేను వాటిని చేరుకోలేకపోయాను. అందుకే నాపై వేటు పడింది. ప్రస్తుతం పూర్తి ఫిట్‌గానే ఉన్నా. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌లోనైనా టీమిండియా తరపున ఆడాలనేది నా కోరిక. ఈ ఏడాది యూఏఈ వేదికగా పొట్టి ప్రపంచ కప్ జరగనుంది. అలాగే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో మరో టీ20 ప్రపంచకప్ జరగనుంది. వేటు పడకు ముందు వరకూ టీ20 జట్టులో నా స్థానం పదిలంగానే ఉంది. మరోవైపు టీమిండియాకి మెరుగైన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అవసరం ఇప్పటికీ ఉంది. టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ లో అంతా బానే ఉంది. కానీ.. మిడిలార్డర్‌లో పంత్ మినహా నిలకడగా వేరెవరూ రాణించడం లేదు’’ అని వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు.
కాగా, దినేష్ కార్తీక్ టీమిండియా తరపున 32 టీ20 మ్యాచ్‌లాడాడు. 33.25 సగటుతో 339 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 42 ఫోర్లు, 15 సిక్సర్లు ఉంన్నాయి. కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. టెస్టుల్లో 26 మ్యాచులు ఆడి 1,025 పరుగులు చేశాడు. అలాగే 94 వన్డేలు ఆడి 1,752 పరుగులు సాధించాడు.
Also Read:
ZIM vs BAN: బంగ్లా ఆటగాడి డ్యాన్స్.. కోపంతో రెచ్చిపోయిన జింబాబ్వే బౌలర్.. ఏం జరిగిందో తెలుసా?