Watch Video: అప్పుడు భారత్‌ను భయపెట్టాడు.. ఇప్పుడు అదే జట్టు దెబ్బకు చిత్తయ్యాడు.. అత్యంత చెత్త రికార్డులో బౌలర్..

|

Aug 07, 2022 | 9:37 PM

అమెరికా గడ్డపై జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఒబెడ్ మెక్‌కాయ్ మొత్తానికి నేలపైకి వచ్చాడు. భారత బ్యాటర్స్ అతనిని హీరో నుంచి జీరో చేసి, చెత్త రికార్డులోకి నెట్టేశారు.

Watch Video: అప్పుడు భారత్‌ను భయపెట్టాడు.. ఇప్పుడు అదే జట్టు దెబ్బకు చిత్తయ్యాడు.. అత్యంత చెత్త రికార్డులో బౌలర్..
Ind Vs Wi Obed Mccoy
Follow us on

క్రికెట్‌లో ఆటగాళ్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అద్భుతమైన ఫాంలో ఉన్నా.. కొన్ని మ్యాచ్‌ల్లో తొలి బంతికే పెవిలియన్ చేరాల్సి ఉంటుంది. ఇక బౌలర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి, వికెట్లు పడగొట్టినా.. మరో మ్యాచ్ వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే వెస్టిండీస్ బౌలర్‌కు ఎదురైంది. వెస్టిండీస్‌కు చెందిన ఓబెడ్ మెక్‌కాయ్‌.. తొలి రెండు టీ20ల్లో హీరోగా నిలిచాడు. కానీ, అమెరికా గడ్డపై జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో మాత్రం బొక్కబోర్లా పడ్డాడు. పాపం అంటూ సహచరులు ఓదార్చాల్సి వచ్చింది. తొలి రెండు టీ20ల్లో జీరో నుంచి హీరోగా మారిన ఈ బౌలర్.. నాలుగో టీ20 వచ్చే సరికి మరోసారి హీరో నుంచి జీరోగా మారాడు. ఇందులో ముఖ్యంగా రోహిత్, సూర్య కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించి, చిత్తుగా ఓడించారు.

అసలు ముందుగా ఓబెడ్ మెక్‌కాయ్ హీరో ఎలా అయ్యాడో తెలుసుకుందాం? భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ సెయింట్ కిట్స్ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మెక్‌కాయ్ 4 ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో కరీబియన్ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. భారత్‌పై తొలిసారిగా టీ20లో ఓ బౌలర్ 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓటమికి మెక్‌కాయ్‌ కారణంగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

4 ఓవర్లలో 6 సిక్సర్లతో 66 పరుగులు..

కానీ, 2 మ్యాచ్‌ల తర్వాత పరిస్థితి మారిపోయింది. అతను 4 ఓవర్లలో 66 పరుగులిచ్చి, బదులుగా ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంటే అతని ఎకానమీ రేటు 16.50గా నిలిచింది. అతని బౌలింగ్ సమయంలో బ్యాటర్లు తక్కువ ఫోర్లు, ఎక్కువ సిక్సర్లు బాదేశారు. మొత్తంగా అతని బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ 3 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టారు.

మెక్‌కాయ్‌కు ఇబ్బందికర రికార్డు..

16.50 ఎకానమీ వద్ద 4 ఓవర్లలో 66 పరుగులు, T20Iలలో ఏ కరేబియన్ బౌలర్ చేసిన చెత్త ప్రదర్శన అయినా ఇదే కావడం గమనార్హం. అంతకుముందు న్యూజిలాండ్‌పై 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చిన కీమో పాల్ పేరిట ఈ రికార్డు ఉంది. కానీ, ప్రస్తుతం మెక్‌కాయ్ అతని కంటే 2 పరుగులు ఎక్కువ ఇచ్చి ఆ అవమానకరమైన రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు.

ఇదే T20I సిరీస్‌లో ఒబెడ్ మెక్‌కాయ్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. అలాగే చెత్త గణాంకాల రికార్డును కూడా తన పేరుతో చేర్చుకున్నాడు. ఇక 5వ టీ20ల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాడో మరి.