SRH vs KKR IPL 2022 Match Prediction: మూడో విజయం కోసం హైదరాబాద్‌.. కోల్‌కతాతో పోరుకు సిద్ధం.. ఇరుజట్ల ప్లేయింగ్‌ XI ఎలా ఉండొచ్చంటే..

|

Apr 14, 2022 | 8:37 PM

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Preview: ఐపీఎల్- 2022 26వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. జట్ల బలాబలాల విషయానికొస్తే.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ఘనంగా పునరాగమనం చేసింది.

SRH vs KKR IPL 2022 Match Prediction: మూడో విజయం కోసం హైదరాబాద్‌.. కోల్‌కతాతో పోరుకు సిద్ధం.. ఇరుజట్ల ప్లేయింగ్‌ XI ఎలా ఉండొచ్చంటే..
Srh Vs Kkr
Follow us on

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Preview: ఐపీఎల్- 2022 26వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. జట్ల బలాబలాల విషయానికొస్తే.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ఘనంగా పునరాగమనం చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించింది. అదే సమయంలో KKR నిలకడైన ఆటతీరును ప్రదర్శించలేకపోతోంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో మరో విజయం కోసం ఇరుజట్లు శుక్రవారం (ఏప్రిల్‌ 15) బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో (SRH vs KKR) ఇరు జట్లలో కొన్ని స్వల్పమార్పులు జరిగే అవకాశం ఉంది.

వాషింగ్టన్ సుందర్ స్థానంలో ..

కాగా గాయం కారణంగా హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతని స్థానంలో శ్రేయాస్ గోపాల్ లేదా జగదీషన్ సుచిత్ కు ఛాన్స్ లభించవచ్చు. ఇక గాయంతో డగౌట్‌కు పరిమితమైన రాహుల్ త్రిపాఠి KKRతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఇక కోల్‌కతా విషయానికొస్తే.. అరోన్‌ ఫించ్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఒకవేళ అతను జట్టులోకి వస్తే రహానే పెవిలియన్‌కే పరిమితం కావొచ్చు. అదేవిధంగా సామ్ బిల్లింగ్స్, పాట్ కమ్మిన్స్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ లలో ఒకరు డగౌట్‌లోనే కూర్చోవాల్సి ఉంటుంది.

కేకేఆర్‌దే ఆధిపత్యం..

కాగా హైదరాబాద్‌, కోల్‌కతా జట్లు ఇప్పటివరకు 21 సార్లు తలపడ్డాయి. కోల్‌కతా 14 సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 సార్లు గెలిచాయి. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అందులోనూ కేకేఆర్‌దే ఆధిపత్యం. సన్‌రైజర్స్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ నాలుగింటిలో విజయం సాధించడం కోల్‌కతా ఆధిపత్యానికి నిదర్శనం. గత సీజన్‌లో రెండు జట్లు రెండుసార్లు ముఖాముఖి తలపడగా, రెండుసార్లు KKR నే గెలిచింది.

ఇరు జట్ల ప్లేయింగ్ ప్లేయింగ్ XI ఎలా ఉండొచ్చంటే..

కోల్‌కతా నైట్ రైడర్స్ :

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, సామ్ బిల్లింగ్స్/ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఐదాన్ మార్క్‌రామ్, శశాంక్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, శ్రేయాస్ గోపాల్/జి సుచిత్

Also Read: Minister KS Eshwarappa: కర్ణాటక పంచాయతీ శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. రేపు సీఎంకు లేఖ అందజేత!

Viral Video: పెళ్లి కూతురు వేషంలో కచ్చా బాదం సాంగ్ ను పాడిన రేణు మండల్.. నెట్టింట్లో వైరల్..

Viral Video: పెళ్లి కూతురు వేషంలో కచ్చా బాదం సాంగ్ ను పాడిన రేణు మండల్.. నెట్టింట్లో వైరల్..