RR vs LSG IPL 2022 Match Preview: రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన లక్నో.. ఇరుజట్ల బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

|

Apr 09, 2022 | 4:32 PM

Rajasthan Royals vs Lucknow Super Giants Prediction: లక్నో జట్టు సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి మూడో స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టీం నాలుగో స్థానంలో నిలిచింది.

RR vs LSG IPL 2022 Match Preview: రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన లక్నో.. ఇరుజట్ల బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Rr Vs Lsg, Ipl 2022
Follow us on

IPL 2022లో ఏప్రిల్ 10 న సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Rajasthan Royals vs Lucknow Super Giants) మధ్య ఒక ఉత్తేజకరమైన మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో తొలిసారిగా ఆడుతున్న లక్నో జట్టు సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి మూడో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దగ్గరగా ఉన్నాయి. మూడో స్థానంలో లక్నో, నాలుగో స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ సేన.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌లు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ లాంటి బలమైన జట్లను ఓడించింది.

రాహుల్ తన బ్యాటింగ్, కెప్టెన్సీతో మెప్పించగా, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని బ్యాటింగ్‌లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బౌలింగ్ విషయానికొస్తే, పేసర్ అవేష్ ఖాన్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బాగా రాణించారు. టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత, వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ చేరిక లక్నో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేసింది.

లక్నో మిడిల్ ఆర్డర్ బాగా ఆడుతోంది..

ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓపెనర్ క్వింటన్ డి కాక్ కేవలం 52 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. బదోని, కృనాల్ పాండ్యా కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి సహకరించారు. బలమైన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌కు వ్యతిరేకంగా కృష్ణప్ప గౌతమ్ ఆకట్టుకున్నాడు. రాహుల్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆదివారం మాత్రం సత్తా చాటాని చూస్తున్నాడు.

రాయల్స్ కూడా..

అయితే నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుత టోర్నీలో అత్యంత బలమైన జట్టుగా అవతరించడంతో లక్నో మార్గం అంత సులువు కాదు. అయితే ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ జట్టు బెంగళూరుపై ఓటమికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌లను వరుసగా 61, 23 పరుగుల తేడాతో ఓడించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీ చేసిన తర్వాత, అతను RCBపై 47 బంతుల్లో 70 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు.

జట్టులో మార్పులు..

బట్లర్‌తో పాటు దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్ కూడా వేగంగా పరుగులు సాధించగల సమర్థులు. కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఎలాంటి బౌలింగ్‌ అటాక్‌నైనా ధ్వంసం చేయగల సత్తా ఉంది. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ గత కొన్ని మ్యాచ్‌ల్లో పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లో విఫలమైన రియాన్ పరాగ్‌ను 6వ ర్యాంక్‌లో నిలుస్తాడా లేదా అనేది కూడా చూడాలి. బట్లర్, హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో, రాయల్స్ ప్లేయింగ్ XIని మరింత సమతుల్యం చేయగల జిమ్మీ నీషమ్ వంటి ఆల్ రౌండర్‌ను ఆడించే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య IPL-2022 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఐపీఎల్ 2022 మ్యాచ్ మంగళవారం, ఏప్రిల్ 10 న జరుగుతుంది.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్ రాత్రి 7 గంటలకు జరగనుండగా, తొలి ఇన్నింగ్స్ 07:30కి ప్రారంభమవుతుంది.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడొచ్చు?

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడొచ్చు.

ఆన్‌లైన్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడొచ్చు?

Disney+Hotstarలో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో చూడొచ్చు. అలాగే మ్యాచ్ అప్‌డేట్స్‌ను tv9telugu.com లో చదవొచ్చు.

రాజస్థాన్, లక్నో జట్లు..

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ప్రశాంత్ కృష్ణ, రియాన్ పరాగ్, దేవదత్ పడిక్కల్, నవదీప్ సైనీ, కరుణ్ నాయర్, రెసీ వాన్ డెర్ డుసెన్, జిమ్మీ నీషమ్, జిమ్మీ నీషమ్ డారిల్ మిచెల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, ఔబెద్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కెసి కరియప్ప.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఎవిన్ లూయిస్, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, కైల్ మైయర్స్, అవేశ్ ఖాన్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోనీ, ఆయుష్ బదోనీ మనన్ వోహ్రా, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్‌పుత్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కరణ్ శర్మ.

Also Read: CSK vs SRH Live Score, IPL 2022: కీలక భాగస్వామ్యం దిశగా సాగుతోన్న రాయుడు, అలీ.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే?

RCB vs MI IPL 2022 Match Prediction: మొదటి విజయం కోసం ముంబై.. మూడో గెలుపు కోసం బెంగళూరు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..