IND vs AFG T20 World Cup 2021 Match Prediction: టీ20 ప్రపంచ కప్ 2021 లో తమ రాబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోహ్లీ సేన ఆశపడుతోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా ప్రస్తుతం చిన్న జట్టులా కాకుండా తన పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ టీంకు కూడా చెమటలు పట్టించింది. బుధవారం (నవంబర్ 3) అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ పోరు జరగనుంది. గ్లోబల్ ఈవెంట్‌లో తమ మొదటి రెండు మ్యాచ్‌లను కోల్పోయిన మెన్ ఇన్ బ్లూ అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంది. సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించాలంటే, భారత్ తమ మిగిలిన మ్యాచ్‌లను అద్భుతంగా గెలవాలి. ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తేనే ఇది సాధ్యం కానుంది. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ మొదటి మూడు గేమ్‌లలో రెండింటిలో గెలిచి నాకౌట్ దశలో బెర్త్‌పై కన్నేసింది. అందువల్ల, ఒక ఆసక్తికరమైన పోటీ కార్డులపై ఉంది.
మ్యాచ్ వివరాలు:
మ్యాచ్ – ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ – మ్యాచ్ నంబర్ 33
వేదిక – షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి.
సమయం – రాత్రి 07:30 గంటలకు
ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి – స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడొచ్చు.
పిచ్ రిపోర్ట్:
అబుదాబిలోని పిచ్ బ్యాటింగ్‌కు అంత గొప్పగా ఏం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు చాలా లయను కనుగొనడంలో చాలా కష్టపడుతూనే ఉంది. ఛేజింగ్ జట్లు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించాయి. 78 శాతం మ్యాచ్‌లు గెలిచాయి.
సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు : 124 (T20 వరల్డ్ కప్ 2021లో అబుదాబిలో 9 T20Iలు)
ఛేజింగ్ జట్ల రికార్డు : గెలిచింది – 7, ఓడిపోయింది – 2, టైడ్ – 0
హెడ్ టు హెడ్ రికార్డ్:
టీ20ల్లో హెడ్-టు-హెడ్ రికార్డు పరంగా ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు కేవలం రెండు T20I మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. మెన్ ఇన్ బ్లూ రెండు సందర్భాల్లోనూ విజయం సాధించింది. ముఖ్యంగా, రెండు మ్యాచ్‌లు T20 ప్రపంచ కప్‌లలో నమోదయ్యాయి. ఇదే రికార్డును కొనసాగించాలని భారత్ భావిస్తోంది.
మ్యాచ్‌లు- 2, భారత్ – 2, ఆఫ్ఘనిస్తాన్- 0, టైడ్- 0
టీ20 ప్రపంచకప్‌లో
మ్యాచ్‌లు- 2, భారత్ – 2, ఆఫ్ఘనిస్తాన్- 0, టైడ్- 0
నిజానికి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువ. మిగిలిన అన్ని లీగ్-స్టేజ్ గేమ్‌లను గెలిచి, ఇతర మ్యాచ్ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే మాత్రమే మెన్ ఇన్ బ్లూ విజయం సాధిస్తుంది. గ్రూప్ 2లో స్కాట్లాండ్ కంటే భారత్ నికర రన్ రేట్ -1.609 మాత్రమే మెరుగ్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్‌లో అనేక మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నందున, టీమిండయాకు ఈ మ్యాచు అంత సులభం కాదు.
మహ్మద్ నబీ సారథ్యంలోని ఆఫ్ఘన్‌కు సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. వారు స్కాట్లాండ్‌తో తమ మునుపటి గేమ్‌ను 62 పరుగుల తేడాతో గెలిచారు. నికర రన్ రేట్ 3.097కి పెంచుకున్నారు.
భారత్ ప్లేయింగ్ XI అంచనా:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి/రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా
బెంచ్: రవిచంద్రన్ అశ్విన్/వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ , సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్
ఆఫ్ఘనిస్తాన్
హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, మొహమ్మద్ నబీ (కెప్టెన్), గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, హమీద్ హసన్, నవీన్-ఉల్-హక్
బెంచ్: ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్, హష్మతుల్లా షాహిదీ, ఉస్మాన్ ఘనీ
T20 World Cup 2021: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలి.. సునీల్ గవాస్కర్ సూచన..