CSK vs SRH IPL 2022 Match Prediction: చెన్నైతో హైదరాబాద్ ఢీ.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

|

Apr 08, 2022 | 3:37 PM

IPL 2022లో, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

CSK vs SRH IPL 2022 Match Prediction: చెన్నైతో హైదరాబాద్ ఢీ.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Ipl 2022 Csk Vs Srh Head To Head
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022)లో , ఏప్రిల్ 9న శనివారం రోజు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ డబుల్ అడ్వెంచర్ క్రికెట్‌లో, మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. అయితే లీగ్‌లో ఈ రెండింటిలో ఏదో ఒక జట్టు గెలుపు ఖాతాను తెరవనుంది. అసలే టోర్నీలో వరుస ఓటములతో ఇరు జట్లూ ఇబ్బంది పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, తొలి విజయం కోసం ఇరుజట్లు ఎదురుచూస్తున్నాయి.

IPL 2022లో, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడగా, రెండూ ఓడిపోయింది. ఇది కాకుండా CSK రన్ రేట్ 1.251గా ఉంటే, SRH రన్ రేట్ మిగిలిన జట్ల కంటే అత్యల్పంగా -1.825గా నిలిచింది.

మ్యాచ్ ఫలితాల విషయానికొస్తే, ఐపీఎల్ 2022లో ఇరు జట్ల ప్రదర్శన దాదాపు ఒకే విధంగా ఉంది. ఐపీఎల్ గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటి వరకు 16 సార్లు ఢీకొన్నాయి. ఈ 16 ఎన్‌కౌంటర్స్‌లో CSK 12 సార్లు గెలుపొందగా, సన్‌రైజర్స్ 4 సార్లు మాత్రమే గెలిచింది. గత 3 సీజన్లలో ఇరు జట్లు 6 సార్లు ఢీకొనగా ఇందులో కూడా ఎల్లో జెర్సీ 4-2తో ముందంజలో ఉంది.

ఈ సీజన్‌లో అంటే ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీకొనబోతున్నాయి.

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం, ఏప్రిల్ 9న జరుగుతుంది.

IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ముంబైలోని డాక్టర్ DY పాటిల్ స్టేడియంలో జరుగుతుంది.

IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 3:30కి జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు టాస్‌ జరుగుతుంది.

IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. అలాగే హాట్‌స్టార్‌లోనూ చూడొచ్చు. మీరు మ్యాచ్‌కి సంబంధించిన అన్ని లైవ్ అప్‌డేట్‌లను tv9telugu.comలో చదవవచ్చు.

ఇరు జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా (కెప్టెన్), మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, మిచెల్ సాంట్నర్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, డెవాన్ కాన్వే, శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, మహీ ప్రిటోరియస్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్, తుషార్ దేశ్‌పాండే, కెఎమ్ ఆసిఫ్, సి హరి నిశాంత్, ఎన్ జగదీశన్, సుబ్రాన్షు సేనాపతి, కె భగత్ వర్మ, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, మార్కో జాన్సెన్, జె సుచిత్ , శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, సీన్ అబాట్, కార్తీక్ త్యాగి, సౌరభ్ తివారీ, ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

Also Read: IPL 2022: గుజరాత్ సారథి ఖాతాలో చేరనున్న స్పెషల్ రికార్డు.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే..

IPL 2022: ఓటమితో పాటు రూ.12 లక్షలు నష్టపోయిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా..

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!