
Team India: భారత క్రికెట్ చరిత్ర 1932, జూన్ 25న తొలి అధికారిక మ్యాచ్‌తో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్రయాణంలో భారత జట్టుకు మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ వంటి గొప్ప కెప్టెన్‌లు లభించారు. అయితే, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీ, సీకే నాయుడు లాంటి గొప్ప కెప్టెన్‌లు భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందు జట్టుకు నాయకత్వం వహించారు. మరి సరిగ్గా 1947, ఆగస్టు 15న కెప్టెన్‌గా ఎవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, భారత క్రికెట్ జట్టుకు ఏ కెప్టెన్ లేడు. స్వాతంత్ర్యం అనంతరం జట్టుకు వెంటనే కెప్టెన్‌ను నియమించలేదు. అయితే, స్వాతంత్ర్యం అనంతరం మొదటి కెప్టెన్‌గా లాలా అమర్‌నాథ్‌ను నియమించారు.
1948 ఫిబ్రవరిలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, లాలా అమర్‌నాథ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఒక మంచి బ్యాట్స్‌మెన్ మరియు బౌలర్‌గా కూడా రాణించారు. అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా కూడా వ్యవహరించేవారు. భారత జట్టు తరపున 24 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 878 పరుగులు చేసి, 45 వికెట్లు తీశారు. స్వాతంత్ర్యానికి ఒక సంవత్సరం ముందు, అంటే 1946లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీ కెప్టెన్‌గా ఉన్నారు.
స్వతంత్ర భారతదేశానికి తొలి కెప్టెన్‌గా లాలా అమర్‌నాథ్ 15 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించారు. అతని కెప్టెన్సీలో భారత్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, 6 మ్యాచ్‌లలో ఓడిపోయింది. మిగిలిన 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. లాలా అమర్‌నాథ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..