
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగడానికి ముందు ఓ అందమైన అమ్మాయి టీవీల్లో ఒక్కసారిగా తళక్కుమంది. ఆ మెరుపు తీగను చూసిన క్రికెట్ ప్రేమికులు ఆమె కోసం ఇంటర్నెట్‌లో వెతకడం మొదలు పెట్టారు. ఎంతలా అంటే.. ఈ ముద్దుగుమ్మ ఎవరూ..? అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఈ అమ్మాయి భారత జట్టు జెర్సీని ధరించి టీమిండియాకు మద్దతుగా నిలిచింది.
ఆసియా కప్ సూపర్-4లో భారత్ మరియు పాకిస్తాన్ మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పవర్ ప్లేలో పాక్ ఫాస్ట్ బౌలర్లను చిత్తు చేశారు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు భారత బ్యాటింగ్‌ను ఉత్సాహపరిచారు. అయితే, సరిగ్గా అదే సమయంలో ఈ చిన్నది కనిపించి కనువిందు చేసింది.
మీరు కూడా ఈ వైరల్‌గా మారిన ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటే.. మేము మీకు ఆ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఈ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్‌కి చెందినది ఈమె పేరు వాజ్మా అయుబి. వాజ్మా ఓ వ్యాపారవేత్త, మోడల్, క్రికెట్ ఫ్యాన్.. క్రికెట్ మ్యాచ్‌లలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఉత్సాహపరుస్తున్న వాజ్మా అయూబీ చాలాసార్లు కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఆమె ఏదైనా జట్టుకు అభిమాని అయితే అది టీమిండియా అని ఆమె స్వయంగా వ్యక్తం చేసింది. వజ్మా భారతదేశాన్ని తన రెండవ ఇల్లు అని కూడా అభివర్ణించారు.
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వాజ్మా అయూబీ ఆసియా కప్ 2022 మ్యాచ్‌లో సంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో ఆ దేశ జాతీయ జెండాతో తన అభిమాన జట్టుకు మద్దతుగా నిలిచినప్పుడు ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా సంచలనంగా మారింది.. క్రీడ పట్ల ఆమెకున్న మక్కువ, ప్రపంచానికి ఆమె ఆఫ్ఘన్ అభిమాని అనే సందేశాన్ని పంపించింది. ఆమె అందం కూడా ఇందుకు కారణంగా మారింది. వాజ్మా ఒక మోడల్, ప్రస్తుతం UAEలోని దుబాయ్‌లో ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ప్రదర్శనలను ఇస్తోంది.
Best of luck to my second home team 🇮🇳♥️ #IndiavsPak #AsiaCup2023 pic.twitter.com/RSOaVm1AMq
— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) September 10, 2023
ఈ ఏడాది ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు సూపర్-4 దశకు చేరుకోలేకపోయింది. ఈ కారణంగా వారు టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు వాజ్మా ఒక వీడియోను షేర్ చేశారు. దీనిలో ఆమె టీమిండియా జెర్సీని ధరించి కనిపించింది. క్యాప్షన్‌లో ఆమె భారతదేశాన్ని తన రెండవ ఇల్లుగా అభివర్ణించింది. వాజ్మా ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న ఆఫ్ఘన్ వ్యాపారవేత్త. ఇక వాజ్మా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల గురించి చెప్పాలంటే.. ఆమె ఫాలోవర్ల సంఖ్య 5.76 లక్షలు.
To my beautiful family, friends, and Fans in Bharat,
Namaste 🙏
I am eternally grateful for the love you have poured on me, and I promise to strive continually to be worthy of your admiration and support.
From the calm backwaters of Kerala, the historical monuments of Delhi,… pic.twitter.com/HEoZQVVQtl
— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) September 13, 2023
వాజ్మా భారతదేశం పట్ల తనకు ఉన్న ప్రేమ చాలా సార్లు ప్రదర్శించింది. దీనికి ముందు ఆమె ఐపిఎల్‌లో కూడా కనిపించింది. ఐపీఎల్ 2023 సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి వజ్మా వచ్చారు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బ్యాటింగ్ చూసి.. ఆమె అతని అభిమానిగా మారింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని వ్యక్తం చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం