SRH IPL Auction: కుర్రకారుకు కొత్త క్రష్ దొరికినట్లు ఉంది. చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున వచ్చిన ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. కెమెరాలు సైతం ఆ అమ్మాయినే క్యాప్చర్ చేశాయి. దీనితో నెటిజన్లలో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియా అంతటా జల్లెడ పట్టి కనిపెట్టారు.
ఆమె పేరు కావ్య మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈవో. లైవ్‌లో మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే ఆమె.. మొదటిసారిగా ఐపీఎల్ వేలానికి వచ్చింది. ఇంకేముంది లెజెండ్స్, సీనియర్ క్రికెటర్లు విచ్చేసిన ఆ వేలంలో అందరి కళ్లను కావ్య మారన్ తనవైపుకు తిప్పుకుంది. 29 ఏళ్ల కావ్య మారన్.. సన్ టీవీ అధినేత కళానిధి మారన్ గారాలపట్టి. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానల్స్‌కు సీఈవో. ఐపీఎల్ ఆక్షన్స్‌లో ఈమె కనిపించడం తక్కువే అయినా.. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే అన్ని ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లకు మాత్రం ఈమె హాజరవుతుంది.
Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..