ఐపీఎల్..ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన మెగా టోర్నీ. ఎంతో మంది ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చిన ఐపీఎల్(IPL) బీసీసీఐ(BCCI)కి కూడా కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ కురుపిస్తూనే ఉంది. ఐపీఎల్ ప్రారంభమై ఏప్రిల్ 18 తేదీకి 15 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా.. అని చాలా మందికి సందేహం రావొచ్చు.. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. మొదటి ఐపీఎల్ నుంచి ఆడుతున్న ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. వారు ఎవరో చూద్దాం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి 2008లో ఏప్రిల్ 18న ఐపీఎల్ ప్రారంభించింది. మొట్టమొదటి IPL మ్యాచ్ ఏప్రిల్ 18, 2008న KKR, RCB మధ్య జరిగింది.
KKRకి సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించగా, RCBకి రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2022లో ఆడుతున్న విరాట్ కోహ్లీ, వృద్ధిమాన్ సాహా తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ, వృద్ధిమాన్ సహా ఇప్పటికి ఆడుతుండడం గొప్ప విషయమే. 2008 ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ అంటే 14 సంవత్సరాల క్రితం, మెకల్లమ్ IPL మొట్టమొదటి మ్యాచ్‌లో అజేయంగా 158 పరుగులు చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మెకల్లమ్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ మొదటి ఓవర్‌లో RCB బౌలర్ ప్రవీణ్ కుమార్ వేసిన మొదటి ఐదు బంతుల్లో స్కోర్ చేయడంలో మెకల్లమ్ విఫలమయ్యాడు. కానీ అతను రెండవ ఓవర్ నుంచి గేర్ మార్చి రికార్డు సృష్టించాడు.
Read Also.. IPL: డెత్ ఓవర్లలో భారీగా పరుగులిస్తున్న ఆ నలుగురు బౌలర్లు.. క్రిస్ జోర్డాన్ ఎన్నో స్థానంలో ఉన్నాడంటే..