ఇంగ్లండ్ అభిమాని జార్వో సరదా ప్రాంక్ లతో ఫేమస్ అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. బౌలర్ బాల్ విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు. తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్‌పై పరిచి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఆ తర్వాత అతడిని చూసి సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్ అభిమాని జార్వో సరదా ప్రాంక్‌లు చేసి బాగా ఫేమస్ అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. బౌలర్ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు. తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్‌లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
గతంలో జార్వో భారత జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చాడు. మొదట అతన్ని ఎవరు గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఆ సమయంలో..భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది.
Also Read:బుజ్జి విమానంలో వరల్డ్ టూర్ షురూ.. 19 యువతి సాహసం..