Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!

|

Mar 19, 2022 | 11:52 PM

Virat Kohli: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక సమస్య చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా విరాట్‌ కోహ్లిపై సినిమా తీస్తే దాని పేరు ఏంటని ట్విట్టర్‌ యూజర్ ప్రశ్నించాడు.

Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!
Virat Kohli
Follow us on

Virat Kohli: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక సమస్య చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా విరాట్‌ కోహ్లిపై సినిమా తీస్తే దాని పేరు ఏంటని ట్విట్టర్‌ యూజర్ ప్రశ్నించాడు. దీంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. వాస్తవానికి కోహ్లీకి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు అతడి బ్యాటింగ్‌ శైలికి ఫిదా అయిపోతారు. కోహ్లీ సెంచరీ చేస్తే చాలు సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేస్తారు. అయితే భవిష్యత్తులో విరాట్ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటనే ప్రశ్నకి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వార్తలు రాసే సమయానికి 6 వేలకు పైగా లైక్‌లు, వందల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. ఒక నెటిజన్ ‘విరాట్ కోహ్లీ – ప్రపంచ క్రికెట్ రారాజు’ అని సూచించాడు. మరోకరు ‘కింగ్ కోహ్లీ’ అని సూచించాడు. భారత క్రికెట్ చరిత్రలో ‘వివాదాస్పద క్రికెటర్’ అని మరొకరు చెప్పారు. ఇది కాకుండా చాలా మంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మీరైతే ఏం సూచిస్తారో కామెంట్ ద్వారా తెలపండి.

అయితే గత కొంతకాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన క్రికెటర్ ఎప్పటికైనా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని.. 71వ సెంచరీ పూర్తి చేస్తాడని రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. వరుసగా తక్కువ స్కోర్లకే కోహ్లీ పెవిలియన్ చేరుతుండటంతో.. ప్రస్తుతం అతడి బ్యాటింగ్ యావరేజ్‌పై ప్రభావం పడింది. ఇంతకాలం అన్ని ఫార్మాట్లలోనూ తమ క్రికెటర్‌దే 50కి పైగా బ్యాటింగ్ సగటు ఉందని చెప్పుకునే విరాట్ కోహ్లీ అభిమానుల గుండె బద్దలయ్యింది. కేవలం 7 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటును దిగజార్చుకున్నాడు. ఐదేళ్ల తర్వాత తొలిసారి అతని బ్యాటింగ్ యావరేజ్ 50 దిగువకు పడిపోయింది.

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Sleep Attack: స్లీప్ అటాక్.. ఈ వ్యాధి చాలా డేంజర్ గురూ.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!

MMRCL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ముంబై మెట్రోలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!