WI vs BAN, T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారం సూపర్-12 గ్రూప్-ఏలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ టీం తొలుగు బ్యాటింగ్ చేయనుంది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఓడిపోయాయి. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇప్పటికే ఇరు జట్లకు కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు చివరి-4లో చేరుకోవడం కూడా కష్టమవనుంది.
మూడవ వరుస గేమ్‌లలో వెస్టిండీస్ టీం ఈ టోర్నమెంట్‌లో మొదట బ్యాటింగ్ చేసింది. మూడుసార్లు ఓడిపోయింది. వెస్టిండీస్ టీం భారతదేశంలో జరిగిన 2016 ప్రపంచకప్‌లో మొత్తం ఆరు గేమ్‌లలో టాస్ గెలిచి, ఛేజింగ్ చేసింది.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో వెస్టిండీస్ జట్టు 6, బంగ్లాదేశ్ టీం 5 మ్యాచుల్లో విజయం సాధించాయి.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రేవో, అకేల్ హోసేన్, రవి రాంపాల్
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్(కీపర్), షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, సౌమ్య సర్కార్, మహ్మదుల్లా(కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, మహేదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్
Mahmud Ullah has won the toss and elected to field ?
Who is coming out on ? in this all-important encounter? #T20WorldCup | #WIvBAN | https://t.co/ZwMJvdYXPi pic.twitter.com/GHQpudmeN5
— ICC (@ICC) October 29, 2021