Video: ఒక మ్యాచ్‌లో 2 రికార్డులు.. 6 బంతుల్లో 43 పరుగులు, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ప్లేయర్ ఎవరంటే.?

|

Jun 26, 2024 | 8:11 PM

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఒకే ఓవర్‌లో 20.. 30.. 36 పరుగులు కాదు.. ఏకంగా 43 పరుగులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ లాంటి పవర్‌ఫుల్‌ బ్యాటర్లను అవుట్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ తన బౌలింగ్ లైన్ అండ్ లెంగ్త్ మర్చిపోయేలా.. డొమెస్టిక్ కౌంటీ బ్యాటర్ షాక్ ఇచ్చాడు.

Video: ఒక మ్యాచ్‌లో 2 రికార్డులు.. 6 బంతుల్లో 43 పరుగులు, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ప్లేయర్ ఎవరంటే.?
Cricket
Follow us on

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఒకే ఓవర్‌లో 20.. 30.. 36 పరుగులు కాదు.. ఏకంగా 43 పరుగులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ లాంటి పవర్‌ఫుల్‌ బ్యాటర్లను అవుట్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ తన బౌలింగ్ లైన్ అండ్ లెంగ్త్ మర్చిపోయేలా.. డొమెస్టిక్ కౌంటీ బ్యాటర్ షాక్ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రాబిన్సన్ చరిత్రకెక్కాడు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాబిన్సన్ తన ఓవర్‌లో ఏకంగా 9 బంతులు వేశాడు. అందులో 8 బంతులు బౌండరీలు రూపంలో పరుగుల వరదను పారించాయి. ఈ ఓవర్లో రాబిన్సన్ 6 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు సమర్పించుకోవడం గమనార్హం.

మ్యాచ్ 59వ ఓవర్‌లో రాబిన్సన్ బౌలింగ్ వేశాడు. మొదటి బంతిని బౌన్సర్‌ వేయగా.. దాన్ని కింబర్‌ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికి రాబిన్సన్ వేసిన నోబాల్‌ను ఫోర్‌ కొట్టాడు. ఇక అనంతరం మూడో బంతిని కూడా ఫోర్‌గా మలిచాడు కింబర్. నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి నో బాల్‌.. అది మళ్లీ ఫోర్‌గా పరుగులు వచ్చాయి. దీని తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాది ఆఖరి బంతికి ఒక పరుగు తీశాడు కింబర్. ఈ విధంగా రాబిన్సన్ ఒక ఓవర్‌లో 43 పరుగులు ఇచ్చాడు.

ఈ ఓవర్‌లో రాబిన్సన్ ప్రతి బంతిని షార్ట్‌ లెంగ్త్‌లో వేయడం గమనార్హం. ఇక కింబర్ దానిని సద్వినియోగం చేసుకున్నాడు. కాగా, రాబిన్సన్ ఇంగ్లాండ్ తరఫున 20 టెస్టుల్లో 76 వికెట్లు పడగొట్టాడు. ఈ చెత్త ఫీట్‌తో కింబర్ తన డబుల్ సెంచరీని కేవలం 100 బంతుల్లోనే పూర్తీ చేయడం విశేషం. ఇది కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ.

ఇది చదవండి: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..