Video: టీమిండియాకు నయా ఆల్ రౌండర్ దొరికాడోచ్.. ఇక ప్రత్యర్థులకు మోత మోగాల్సిందే.. వీడియో చూస్తే షాకే

|

Oct 18, 2023 | 1:30 PM

IND vs BAN: ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పూణే చేరుకున్న టీమిండియా.. తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆటగాళ్లందరూ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈమేరకు బీసీసీఐ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అందుకు గల కారణం కూడా ఉంది. ఈ వీడియోలో రోహిత్ శర్మ మరో అవతారం ఎత్తాడు.

Video: టీమిండియాకు నయా ఆల్ రౌండర్ దొరికాడోచ్.. ఇక ప్రత్యర్థులకు మోత మోగాల్సిందే.. వీడియో చూస్తే షాకే
Team India Practies Rohit
Follow us on

Team India: ప్రపంచకప్‌ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకపోతోంది. అరంగేంట్ర మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఘన విజయంతో అగుడుపెట్టింది. ఇక రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి, ఆ తర్వాత పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఇక నాలుగో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ టీంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.

అయితే, ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పూణే చేరుకున్న టీమిండియా.. తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆటగాళ్లందరూ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈమేరకు బీసీసీఐ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అందుకు గల కారణం కూడా ఉంది. ఈ వీడియోలో రోహిత్ శర్మ మరో అవతారం ఎత్తాడు. ఇప్పటి వరకు రోహిత్‌ను బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో చూసిన వారంతా.. ఈ కొత్త అవతారం చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో భాగంగా బౌలింగ్ చేశాడు. తన ఆఫ్ స్పిన్‌తో జడేజాకు బౌలింగ్ చేశాడు. రోహిత్ బౌలింగ్‌లో జడేజా బ్యాటింగ్ చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ మేరకు బీసీసీఐ వీడియో షేర్ చేస్తూ.. ఆఫ్ స్పిన్నర్ రోహిత్ శర్మకు హాయ్ చెప్పండి అంటూ క్యాప్షన్ అందించింది. ఈ వీడియో చూసిన వారంతా రోహిత్ బౌలింగ్‌పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. టీమిండియాకు మరో ఆల్ రౌండర్ దొరికాడని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరో హర్దిక్ లోడ్ అవుతున్నాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి రోహిత్‌ను ఇలా చూడడం బాగుందంటూ అంతా చెబుతున్నారు. మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క ఓవరైనా రోహిత్ బౌలింగ్ చేయాలంటూ కోరుతున్నారు.

టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో..

టీమ్ ఇండియా మిగిలిన మ్యాచ్‌లు..

19 అక్టోబర్- వర్సెస్ బంగ్లాదేశ్

22 అక్టోబర్- వర్సెస్ న్యూజిలాండ్

29 అక్టోబర్- vs ఇంగ్లాండ్

2 నవంబర్ – vs శ్రీలంక

5 నవంబర్ – వర్సెస్ సౌతాఫ్రికా

11 నవంబర్- vs నెదర్లాండ్స్

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , శుభమాన్ గిల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..