IND Vs SA: నెట్స్‎లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. వైరల్‎గా మారిన వీడియో..

|

Dec 19, 2021 | 12:58 PM

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది...

IND Vs SA: నెట్స్‎లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. వైరల్‎గా మారిన వీడియో..
Virak Kohli
Follow us on

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్టుకు ముందు భారత జట్టు శనివారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొన్ని చిట్కాలు ఇవ్వడం కనిపించగా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా ఇతరులు ప్రాక్టీస్ చేయడం జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియోను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ట్విట్టర్‎లో పోస్ట్ చేసింది. దక్షిణాఫ్రికాలో భారత్‌కు టెస్ట్ ఫార్మట్‎లో రికార్డు బాగా లేదు. దక్షిణాఫ్రికాలో గతంలో ఏడు సార్లు పర్యటించిన భారత్ ఆరు సార్లు సిరీస్ ఓడిపోయింది. ఈసారి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఇండియా విజయాలను సాధించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ జట్టునైనా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్న లైనప్‌ భారత్‎కు ఉంది. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్‎లో న్యూజిలాండ్‌పై 1-0 టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న ప్రోటిస్ పర్యటనలో రాణిస్తారో లేదో చూడాలి.

ఈ సిరీస్‎కు వైస్-కెప్టెన్‎గా ఎంపికైన రోహిత్ శర్మ గాయం కారణంగా మూడు టెస్టులకు దూరమయ్యాడు. రోహిత్ గైర్హాజరీలో విరాట్ కోహ్లికి డిప్యూటీగా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగి టెస్టుల్లో అతను ఆడలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు డిసెంబర్ 26న ప్రారంభం కాగా, రెండో టెస్టు జనవరి 3 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. మూడో టెస్టు జనవరి 11న కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ప్రారంభమవుతుంది.

Read Also.. Year Ender 2021: తేలిపోయిన అంతర్జాతీయ ఓపెనర్లు.. రోహిత్ శర్మ ముందు అంతా డీలా.. ఈ ఏడాది ఆ లిస్టులో మనోడే నంబర్ వన్‌..!