షెఫాలీ వర్మ.. ఇప్పుడు భారత ఫిమేల్ క్రికెట్ టీమ్‌లో స్టార్ ప్లేయర్. తాజాగా ఈమె ఆస్ట్రేలియాలో జరుగుతోన్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సిడ్నీ సిక్సర్స్ తరఫున గురువారం అరంగేట్రం చేసింది. అయితే, ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించకపోయినప్పటికీ, ఫీల్డింగ్‌లో సత్తా చాటింది. ఓ అద్భుతమైన రనౌట్‌తో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. డైరెక్ట్ త్రోతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను మెరుపు వేగంతో ఔట్ చేసింది. ఈ వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె స్కిల్ చూసి క్రికెట్ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వావ్, ఎక్స్‌లెంట్ ఫీల్డింగ్’, ‘కిర్రాక్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు షెఫాలీని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పోలుస్తూ ‘లేడీ జడేజా’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
వీడియో చూడండి
What a throw! Welcome to the @WBBL, Shafali Verma ?@CommBank | #WBBL07 pic.twitter.com/X6mhtzwUp8
— cricket.com.au (@cricketcomau) October 14, 2021
మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సిడ్నీ సిక్సర్స్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఎల్లీస్సీ పేరీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి మెల్‌బోర్న్ బ్యాటర్ ఎలీసీ విల్లాని షార్ట్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా షాట్ కొట్టింది. అయితే, నాన్‌స్ట్రైకర్ వైపు ఉన్న సుదర్‌లాండ్ అనే మరో బ్యాటర్ క్రీజు వదిలి కొద్దిగా ముందుకెళ్లింది. అప్పుడే షెఫాలి బంతి అందుకొని.. మెరుపు వేగంతో వికెట్లకేసి డైరెక్ట్ త్రో విసిరింది. దీంతో క్రీజు బయటున్న సుదర్‌లాండ్(14) అవుట్ అయ్యింది. ఆమె త్రో చూసి కామెంటేటర్లు కూడా స్టన్ అయ్యారు. ప్రశంసలు కురిపించారు. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ ఒక వికెట్ నష్టానికి 99 రన్స్ చేసింది. విల్లాని(54), లాన్నింగ్(23) చివరివరకూ బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం సిడ్నీ సిక్సర్స్ బ్యాటర్లు నాలుగు వికెట్లు కోల్పోయి 10.2 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేశారు. ఓపెనర్ అలిస్సా హేలీ (57) హాఫ్ సెంచరీ చేసింది. షెఫాలీ(8) రన్స్‌కే పెవిలియన్ చేరి బ్యాటింగ్‌లో నిరాశపరిచింది.
Also Read: రోమాలు నిక్కపొడుచుకునే చిరు స్పీచ్.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. నెట్టింట వైరల్