T20 World Cup 2021: అదిరిపోయే సిక్స్ కొట్టిన జాసన్ రాయ్.. వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ..

|

Oct 28, 2021 | 7:55 PM

టీ 20 ప్రపంచ కప్‎లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో జాసన్ రాయ్ ఆకట్టుకున్నాడు. ఈ ఓపెనర్ హాఫ్ సెంచరీతో రాణించాడు...

T20 World Cup 2021: అదిరిపోయే సిక్స్ కొట్టిన జాసన్ రాయ్.. వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ..
Roy
Follow us on

టీ 20 ప్రపంచ కప్‎లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో జాసన్ రాయ్ ఆకట్టుకున్నాడు. ఈ ఓపెనర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రాయ్ 38 బంతుల్లో 61 పరుగులు చేయడంతో 14.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. 31 ​ఏళ్ల మహేదీ హసన్ ఏడో ఓవర్ మూడో బంతిని డెలివరీని లాంగ్ ఆన్ మీదుగా రాయ్ సిక్సర్ బాదాడు. బాల్ గాల్లో ఎత్తుకు ఎగిరినప్పటికీ బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ నయీమ్ రోప్‌ల దగ్గర డైవింగ్ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బౌండరీకి​సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో డైనోసార్ లాంటి స్టఫ్డ్ ఫిగర్ పైన కూర్చున్న అభిమానిని కూడా చూపించింది. ఆ వీడియోకి “ఎ జురాసిక్ సిక్స్ ఫ్రమ్ జాసన్ రాయ్” అని క్యాప్షన్ ఇచ్చింది.

ఇది టీ20 మ్యాచ్‎లో ఏడో అర్ధ సెంచరీ. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ 30 బంతుల్లో 29 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోర్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ టైమల్ మిల్స్ అద్భుతమైన ఫామ్‌తో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. విజయం తర్వాత, ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని జట్టు ఇప్పుడు రెండు మ్యాచ్‎ల్లో రెండు విజయాలతో గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ రెండు ఓటములతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

అక్టోబర్ 24న శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మహ్మద్ నయీమ్ 52 బంతుల్లో 62 పరుగులు చేశాడు. రహీమ్ 37 బంతుల్లో 57 పరుగులు చేశాడు. లక్ష్యఛేధనకు బరిలోకి దిగిన శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చరిత అసలంక 49 బంతుల్లో 80 పరుగులు చేశాడు. రాజపక్స 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

Read Also.. Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..