Pakistan: పాక్ క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం.. టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సర్లు కొట్టిన బౌలర్.. ఎవరంటే.?

అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు నెలకొల్పడం సర్వసాధారణం. అయితే ఓ బౌలర్.. టెస్ట్ క్రికెట్‌లో ఏకంగా 12 సిక్సర్లు కొట్టి.. ఇప్పటికీ తిరుగులేని రికార్డును నెలకొల్పాడు. మరి అతడెవరో తెలుసా.? ఆ రికార్డు ఏంటంటే.? ఆ వివరాలు ఇలా.. ఓ సారి లుక్కేయండి.

Pakistan: పాక్ క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం.. టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సర్లు కొట్టిన బౌలర్.. ఎవరంటే.?
Wasim Akram

Updated on: Jan 06, 2026 | 12:48 PM

1996లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 257 పరుగులు సాధించిన అక్రమ్.. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 12 సిక్సులు కొట్టాడు. ఈ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. వివరాల్లోకి వెళ్తే.. మీకు ఇది తెలుసా.! టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఒక బౌలర్ పేరిట ఉంది. 1996వ సంవత్సరంలో, పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ జింబాబ్వేతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు.

ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. నెంబర్ ఎనిమిదిలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్రమ్.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 257 పరుగులు చేశాడు. ఇది కేవలం ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ మాత్రమే కాదు.. ఈ అరుదైన ఇన్నింగ్స్‌లో అతడు మొత్తం 12 సిక్సులు బాది టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని ఒక రికార్డును సృష్టించాడు. ఇప్పటికీ, వసీం అక్రమ్ కొట్టిన ఈ 12 సిక్సులు ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్సులుగా కొనసాగుతున్నాయి. ఈ అరుదైన రికార్డును ఏ బ్యాట్స్‌మెన్ కూడా బ్రేక్ చేయలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి