Viral Video: సుందర్‌ స్పిన్‌ మ్యాజిక్‌కు నోరెళ్ల బెట్టిన బ్యాటర్‌.. బంతి వికెట్లను ఎలా పడగొట్టిందో మీరే చూడండి

Washington Sundar: లంకాషైర్‌ తరఫున తొలిసారి కౌంటీ క్రికెట్‌లోకి బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్‌ (Washington Sundar) అద్భుతప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఐదు వికెట్లతో రాణించిన ఈ స్పిన్‌ బౌలర్‌ ..

Viral Video: సుందర్‌ స్పిన్‌ మ్యాజిక్‌కు నోరెళ్ల బెట్టిన బ్యాటర్‌.. బంతి  వికెట్లను ఎలా పడగొట్టిందో మీరే చూడండి
Washington Sundar

Updated on: Jul 29, 2022 | 2:43 PM

Washington Sundar: టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో బిజిబిజీగా గడుపుతున్నాడు. మళ్లీ తన ఫామ్‌ను చాటుకుని టీమ్‌ఇండియాలో చోటు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈక్రమంలో కౌంటి ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ 1లో తన స్పిన్‌ మ్యాజిక్‌తో ప్రత్యర్థి జట్ల పని పడుతున్నాడు. లంకాషైర్‌ తరఫున తొలిసారి కౌంటీ క్రికెట్‌లోకి బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్‌ (Washington Sundar) అద్భుతప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఐదు వికెట్లతో రాణించిన ఈ స్పిన్‌ బౌలర్‌ తాజాగా కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తన ప్రతాపాన్ని చూపించాడు. ఈక్రమంలో సుందర్‌ వేసిన ఓ బంతి సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌స్టంప్‌ వైపుగా వెళ్లిన బంతిని అడ్డుకుందామని ప్రయత్నించిన కెంట్‌ బ్యాటర్‌ జోర్డాన్‌ కాక్స్‌ అంచనాలు విఫలమయ్యాయి. బంతి ప్యాడ్ల సందులో నుంచి వెళ్లి మరీ వికెట్లను పడగొట్టింది.

కాగా దీనికి సంబంధించిన వీడియోనూ కౌంటీ చాంపియన్‌షిప్‌ తన అధికారికి ట్విట్టర్‌ పేజలో షేర్‌ చేసింది. ‘సుందర్‌ నుంచి నమ్మశక్యం కానీ బాల్‌.. సూపర్‌’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చింది. అంతకుముందు కెంట్‌ కెప్టెన్‌ జాక్‌లీనింగ్‌ను కూడా ఇలాగే పడగొట్టాడు సుందర్‌. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిసి అతను 5 వికెట్ల పడగొట్టడం విశేషం. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లంకాషైర్‌ తొల ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత కెంట్ 270 పరుగులకు ఆలౌటై 125 పరుగులు మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంకాషైర్‌ అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. 436/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి 311 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. అయితే సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కెంట్‌ 127 పరుగులకే చాప చుట్టేసింది. టామ్‌ బెయిలీ 5 వికెట్లతో చెలరేగగా, సుందర్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..