
Ind vs Eng 3rd Test : ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అక్కడ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిస్తే, భారత్ మరో మ్యాచ్ గెలిచింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. రెండో టెస్ట్‌లో భారత్ ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను రసవత్తరంగా మార్చింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ సాధించాడు. ఇప్పుడు మూడో టెస్ట్ చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు జో రూట్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా, ఈ మైదానంలో రూట్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.
జో రూట్ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు. జో రూట్ ఎలాంటి బ్యాట్స్ మెన్ అంటే తను ఏ క్షణంలోనైనా పుంజుకుని బౌలర్ల మీద విచక్షణారహితంగా విరుచుకుపడగలడు.లార్డ్స్‌లో అతని గణాంకాలు ఇదే తెలియజేస్తున్నాయి. జో రూట్ ఈ మైదానంలో చాలాసార్లు బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టాడు. లార్డ్స్‌లో అతను 40 ఇన్నింగ్స్‌లలో 54.7 సగటుతో 2022 పరుగులు చేశాడు. అతని రికార్డులో 7 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. దీంతో అతను భారత్ బౌలింగ్ లైనప్‌కు భారీ ముప్పుగా మారే అవకాశం ఉంది.
లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌కు ముందు పేసర్ గస్ అట్కిన్సన్ ఇంగ్లాండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అట్కిన్సన్ గాయం కారణంగా బయట ఉన్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరే అవకాశం ఉంది. అతను ఇంగ్లాండ్ తరపున 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 55 వికెట్లు తీశాడు, బ్యాటింగులో 352 పరుగులు చేశాడు. తన ఖాతాలో ఒక సెంచరీ కూడా ఉంది. బంతి, బ్యాట్ రెండింటితోనూ తనను ఒక డేంజరస్ ప్లేయర్‌గా పరిగణిస్తున్నారు.
సిరీస్‌లో మూడో టెస్ట్ లండన్‌లోని లార్డ్స్‌లో జూలై 10 నుంచి జూలై 14 వరకు మారనుంచి. ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో జస్ ప్రీత్ బుమ్రా కూడా తిరిగి వస్తాడని అంచనా, ఇది భారత్ బౌలింగ్ దళాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..